Weekly Horoscope: ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 28, 2024 వరకు): మేష రాశికి చెందిన వారికి ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ప్రభుత్వ మూలక ధన లాభం లేదా గుర్తింపు ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 22, 2024 | 5:01 AM

వార ఫలాలు (సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 28, 2024 వరకు): మేష రాశికి చెందిన వారికి ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ప్రభుత్వ మూలక ధన లాభం లేదా గుర్తింపు ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

వార ఫలాలు (సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 28, 2024 వరకు): మేష రాశికి చెందిన వారికి ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ప్రభుత్వ మూలక ధన లాభం లేదా గుర్తింపు ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 13
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం కారణంగా ఆదాయ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. తృతీయంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయక పోవడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. తరచూ దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం మంచిది.

2 / 13
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): సొంత రాశిలో గురువు, ధన స్థానంలో కుజుడు, లాభస్థానంలో రాహువు ఉన్నందువల్ల, ఆదాయం బాగా పెరిగి ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. కొద్ది శ్రమతో ఆర్థికంగా అధిక లాభాలు పొందుతారు. కీలకమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, ఊరట కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా బంధువర్గంలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. మధ్య మధ్య శివార్చన చేయించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

3 / 13
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): పంచమ స్థానంలో శుక్రుడు, రాశ్యధిపతి బుధుడితో రవి కలయిక కారణంగా ప్రతిభా పాటవాలకు, సమర్థతకు సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వ మూలక ధన లాభం లేదా గుర్తింపు ఉంటాయి. సాధారణంగా ఈ గ్రహ స్థితిగతుల వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి కార్యం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సుందరకాండ పారాయణం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

4 / 13
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభంలో గురువు, తృతీయంలో రవి, బుధులు, చతుర్థంలో శుక్రుడి సంచారం కారణంగా కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు.

5 / 13
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సప్తమ స్థానంలో వక్ర శని సంచారం వల్ల శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆదాయ ప్రయత్నాలు మాత్రం సునాయాసంగా నెరవేరే అవకాశం ఉంది. ధన, తృతీయ స్థానాల్లోఝ శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగపరంగా మంచి అదృష్టాన్ని సూచిస్తున్నాయి. ఆశించిన శుభ వార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా సమస్యలు ఉత్పన్న మవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. రోజూ ఉదయం ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

6 / 13
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ వారం మధ్యలో రాశ్యధిపతి బుధుడు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందువల్ల ప్రతికూల పరిస్థితు లన్నీ సానుకూల పరిస్థితులుగా మారే అవకాశం ఉంది. ధన స్థానంలో శుక్రుడు, భాగ్య స్థానంలో గురువు ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరుస్తాయి. అన్ని విధాలుగా సమయం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలకు ఆస్కారముంది. ఎదురు చూస్తున్న శుభ వార్తలు అందుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడి స్తారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఈ రాశివారు తరచూ దుర్గా స్తోత్రాన్ని పఠించడం మంచిది.

7 / 13
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశిలో సంచరిస్తున్న శుక్రుడు, షష్ట స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శని కారణంగా ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. నిరుద్యోగులకు సొంత ప్రాంతంలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావా దేవీల వల్ల బాగా లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ముఖ్యమైన దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు లాభిస్తాయి. తరచూ స్కంద స్తోత్రం చదువుకోవడం వల్ల శుభం జరుగుతుంది.

8 / 13
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి ప్రస్తుతం సప్తమంలో గురువు, లాభ స్థానంలో రవి, బుధులు అనుకూలంగా ఉన్నం దువల్ల ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. గౌరవ మర్యాదలకు కూడా లోటుండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు గడిచిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదు రుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గణపతి స్తోత్రం పఠించడం అవసరం.

9 / 13
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): తృతీయంలో శని, లాభ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి, బుధులు ముఖ్యమైన శుభ పరిణామాలకు దోహదం చేస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, విలాసాల మీద ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సునాయాసంగా నెరవేరు తాయి. ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సంతృప్తిగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగం విషయంలో ఆశిం చిన సమాచారం అందుతుంది. దత్తాత్రేయ స్తోత్ర పఠనం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.

10 / 13
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో ధనాధిపతి శని, తృతీయంలో రాహువు, పంచమ స్థానంలో గురువు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి బాగా సహకరిస్తాయి. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దశమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు గడిస్తాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం తగ్గుతుంది.

11 / 13
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో రవి, బుధుల వల్ల ఇంటా బయటా గౌరవ మర్యాద లకు, ఆదరణకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా సాగిపోతాయి.  ఆదాయం నిలకడగా ఉంటుంది.  వ్యాపారాల్లో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. దనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతరుల వివాదాల్లో తల దూర్చవద్దు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆరోగ్య భంగమేమీ ఉండకపోవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభం ఉంటుంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఈ రాశివారు తప్పకుండా తరచూ శివార్చన చేయాల్సిన అవసరం ఉంది.

12 / 13
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): తృతీయంలో రాశ్యధిపతి గురువు, చతుర్థంలో ధన, భాగ్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నం దువల్ల ఆర్థికంగా ఒకటి రెండు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో  ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి జీవితం సాదా సీదాగా సాగి పోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతో షాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అను కూలత వల్ల ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు. కాలభైరవాష్టక పఠనం వల్ల కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.

13 / 13
Follow us