- Telugu News Photo Gallery Chanakya niti says that husband has to maintain secrets in these matters with wife aacharya chanakya on good relationship
భర్తలూ అలర్ట్.. ఈ రహస్యాలను భార్యతో ఎప్పుడూ పంచుకోవద్దట.. చాణక్యుడు ఏం చెప్పాడంటే..
భార్యాభర్తల బంధం ఎప్పుడూ పారదర్శకంగా ఉండాలని అంటారు. అంటే భార్యాభర్తలూ ఇద్దరూ ఒకరికొకరు ఏమీ దాచుకోకూడదు. కానీ ఆచార్య చాణక్యుడు ప్రకారం, భర్త తన భార్యకు చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వైవాహిక జీవితానికి సంబంధించి..
Updated on: Sep 23, 2024 | 4:28 PM

ఆచార్య చాణక్యుడు జీవితంలో జరిగే ప్రతీ విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను తన నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు.. పురణాల ప్రకారం.. ఆచార్య చాణక్యుడు సంపద, విజయం, స్నేహం, ద్వేషం, వైవాహిక జీవితం గురించి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాడు. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను పాటించడం లేదా అవసరమైనప్పుడు ఉపయోగించడం ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తులో అనేక సమస్యలను నివారించవచ్చు.. ఇంకా విజయం వైపు పయనించవచ్చు.. చాణక్యుడి బోధనల ద్వారా, ఒక వ్యక్తి భవిష్యత్తులో అనేక సమస్యలను నివారించవచ్చు.. ధీటుగా ఎదుర్కొనవచ్చు..

ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, సలహాదారుడు.. నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త.. అతని నీతిశాస్త్రం జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను బోధిస్తుంది.. చాణక్యుడి ఈ మాటలు ఇప్పటికీ జీవితంలో విజయం సాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తాయి. అయితే.. వైవాహిక బంధం గురంచి కూడా విపులంగా బోధించాడు.. భార్యాభర్తల బంధం ఎప్పుడూ పారదర్శకంగా ఉండాలని అంటారు. అంటే భార్యాభర్తలూ ఇద్దరూ ఒకరికొకరు ఏమీ దాచుకోకూడదు. కానీ ఆచార్య చాణక్యుడు ప్రకారం, భర్త తన భార్యకు చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వైవాహిక జీవితానికి సంబంధించి భార్యకు భర్త ఎలాంటి విషయాలను చెప్పకూడదు.. చాణక్యుడు చెప్పిన సలహాలు ఏంటో చూడండి..

పురుషులు తమ బలహీనతలను భాగస్వామికి ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే వారు మీ బలహీనతను మీకు వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో బలహీనతల గురించి ప్రస్తావించి మనోవేదనకు గురిచేసే అవకాశం ఉంది..

అవమానం గురించి భర్త భార్యకు ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో వారు దానిని దృష్టిలో ఉంచుకుని మీకు అవమానాన్ని పునరావృతం చేస్తారు. మళ్లీ అవమానం ఎదురవుతుంది..

విరాళం.. ఎల్లప్పుడూ గోప్యంగా ఉండాలి. కుడిచేతితో ఇస్తే ఎడమచేతికి తెలియకూడదనే సామెత. అదేవిధంగా, భర్త విరాళం గురించి భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్య ఆర్థిక వివాదం, ఘర్షణకు దారి తీస్తుంది.

మీరు ఎంత సంపాదిస్తారో, ఎంత చెల్లిస్తారో మీ భార్యకు తెలియకూడదు. ఎందుకంటే.. వారు మీ ఖర్చులను నియంత్రించే అవకాశం ఉంది. దీంతో అవసరమైన మేరకు ఖర్చు చేయడం కష్టం అవుతుందంటూ చాణక్యుడు చెప్పాడు. (గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ నమ్మకాలు, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. టీవీ9 దీనిని ధృవీకరించడంలేదు.)




