AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career Horoscope 2022: కొత్త ఏడాది ఈ 4రాశుల ఉద్యోగులకు ఆర్ధికంగా శుభవార్తని తెస్తుంది.. అందులో మీరున్నారా..

Zodiac Signs in 2022: మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాం.. అయితే ఎవరైనా సరే కొత్త ఏడాదిలోనైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండలని..

Career Horoscope 2022: కొత్త ఏడాది ఈ 4రాశుల ఉద్యోగులకు ఆర్ధికంగా శుభవార్తని తెస్తుంది.. అందులో మీరున్నారా..
Horoscope 2022
Surya Kala
|

Updated on: Dec 31, 2021 | 5:57 PM

Share

Career Horoscope 2022: మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాం.. అయితే ఎవరైనా సరే కొత్త ఏడాదిలోనైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో రాహు, గురు, శని  మూడు గ్రహాలు కొన్ని రాశులపై ప్రభావాన్ని చూపించనున్నాయి.  12 ఏప్రిల్ 2022న.. రాహువు మేషరాశిలో సంచరిస్తాడు,  12 ఏప్రిల్ 2022న బృహస్పతి మీనరాశిలో సంచరిస్తాడు.. ఇక 29 ఏప్రిల్ 2022న శని మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాశుల వారికి  కొత్త ఏడాది శుభప్రదంగా మారబోతుంది.

మేష రాశి : రాబోయే సంవత్సరం కెరీర్ పరంగా మేషరాశి వారికి చాలా అదృష్టమని చెప్పవచ్చు. ఈ రాశి వారికి మంచి ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగాలు మారాలని చూస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. జీతం పెరగడంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపారస్థులకు  కూడా  కొత్త సంవత్సరంలో శుభఫలితాలను ఇస్తుంది. భారీ లాభాలను ఆర్జిస్తారు. అయితే ఈ రాశివారు ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు డబ్బు ఆదా చేయడం, సరైన పద్దతులలో పెట్టుబడి పెట్టడం మంచిది.

వృషభ రాశి: ఈ రాశివారికి కొత్త సంవత్సరం అదృష్టాన్ని పెంచుతుంది.  జీతం పెరగడం, ఉద్యోగంలో పదోన్నతి వంటి శుభవార్తలు వింటారు. కష్టపడి, నిజాయితీతో మీ పనిని కొనసాగించండి. కొత్త సంవత్సరం వ్యాపారులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆఫీసుల్లో మీ పని ప్రశంసలను పొందుతుంది.  అంతేకాదు తోటి ఉద్యోగుల నుంచి అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

మిథున రాశి : ఈ రాశి వారికి రాబోయే సంవత్సరం శుభాలను తెస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు అనేక విధాలుగా డబ్బు సంపారించే అవకాశాలను పొందుతారు. తెలివితేటలతో పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు పడిన  శ్రమకు పూర్తి ఫలితం లభిస్తుంది. ఈ రాశివావారు ఆస్తిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, దానికి ఇదే సరైన సమయం.

కర్కాటక రాశి :  ఈ రాశి వారు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే..  కొత్త సంవత్సరంలో అన్వేషణ పూర్తవుతుంది. మంచి ఉద్యోగవకాశాలు లభిస్తాయి.  ఆఫీసులో కూడా మంచి స్టేజ్ కు చేరుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి వచ్చే ఏడాది శుభఫలితాలు పొందుతారు.

Also Read:  ఓ ప్రముఖ చపాతీ పిండి ప్యాకెట్ నుంచి బయటపడిన చచ్చిపోయిన కప్ప.. కస్టమర్ షాక్..