Horoscope 2022: కొత్త సంవత్సరం ఈ తేదీల్లో పుట్టినవారు, ఈ రాశివారు ఏమి మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు.. జాగ్రత్తగా ఉండాల్సిందే..
Horoscope 2022: కొన్ని రాశుల వ్యక్తులు కొత్త సంవత్సరంలో చేపట్టిన పనుల్లో విజయాన్ని పొందుతారు. వారి ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మెరుగుదలకు అవకాశం ఉంది. కెరీర్‌లో మంచి విజయాలు సాధిస్తారు.
Horoscope 2022: 2021 సంవత్సరానికి వీడ్కోలు చెప్పడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో కొత్త సంవత్సరం 2022 కి మరికొన్ని గంటల్లో స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నాం.. దీంతో కొత్త సంవత్సరంలోనైనా దేవుని అనుగ్రహం ఉండాలని.. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుని కష్టాలు తొలగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రాబోయే 2022 సంవత్సరం సంఖ్య 6 చిహ్నం.. ఈ ఆరు శుక్ర గ్రహంన్ని సూచిస్తుంది. అందువల్ల, సంవత్సరం మొత్తం శుక్రుని ప్రభావం ఉంటుంది. సంవత్సరం ప్రారంభం కన్యా రాశి తో మొదలవుతుంది. ఈ సంవత్సరం ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అంతేకాదు 2022 ప్రారంభంలో.. చంద్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు, దీంతో కుజుడు బలమైన ప్రభావాన్ని చూపించనున్నాడు. 2022లో శుక్రుడు, కుజుడు ఆధిపత్యం చూపించే వ్యక్తులు చాలా లాభపడతారు. ఒకవైపు ప్రపంచంలో ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది. మరోవైపు యుద్ధ వాతావరణం నెలకొంటుంది. 2022లో ఏ వ్యక్తులు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం..
2022 వీరికి లాభాలను తెస్తుంది:
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, 2022 లో కొంత మంది వ్యక్తులు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నారు. ముఖ్యంగా 06 నుంచి 15 ఏళ్ల లోపు 24 లేదా 15, 24, 33 లేదా 42 సంవత్సరాల వయసున్న వారికి ఈ సంవత్సరం డబ్బు పరంగా ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాదు ఫిబ్రవరి, మార్చి లేదా ఏప్రిల్‌లో పుట్టిన వారు లేదా వృషభ, సింహ, తుల, వృశ్చిక, కుంభ రాశుల వారికి శుక్ర, కుజుడు అనుగ్రహం లభించి 2022లో విజయాన్ని అందుకుంటారు.
2022లో సమస్యలు పడేవారు: పుట్టిన తేదీ 01, 10, 09, 18, 27, 18 ఉన్నవారు లేదా జాతకంలో శుక్రుడు లేదా కుజుడు నీచంగా నడుస్తున్నట్లయితే.. ఏమి మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు. వివాదంలో చిక్కుకోవచ్చు. వీరు సంవత్సరం పొడవునా జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు కుటుంబ సంబంధాలు కూడా క్షీణించవచ్చు.
2022 శుభకరంగా ఉండాలంటే: 2022 బాగుండాలంటే, బొటన వేలికి వెండి ఉంగరాన్ని ధరించండి. అంతేకాదు లక్ష్మిని ప్రత్యేకంగా పూజించండి.ప్రతి శుక్రవారం శ్రీ సూక్తం పఠించండి. క్రీమ్ , పింక్ కలర్‌లను ఎక్కువగా వాడండి. నలుపు రంగు దుస్తులకు దూరం ఉంచండి.
మంచి ఫలితాలు ఇచ్చే 2022:
సంపద , విద్య పరంగా 2022 చాలా మంచి సంవత్సరం. ఈ సంవత్సరం, శుక్ర, కుజుడు అనుగ్రహంతో, ప్రజలు ధనలాభాలను పొందుతారు. విజయం కోసం శ్రీమహావిష్ణువు సమేత లక్ష్మీదేవిని పూజించండి.
Also Read: మొక్కలు నాటిన వనజీవి రామయ్య.. కొత్త ఏడాదికి మొక్కలు నాటి స్వాగతం పలకాలని పిలుపు