Zodiac Signs: నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశి ఉందా..?

ప్రస్తుతం మీన రాశిలో నీచ స్థితిలో, వక్రగతిలో సంచారం చేస్తున్న బుధ గ్రహం వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 9 వరకూ మీన రాశిలో ఉండే బుధుడి వల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందడమే కాకుండా..

Zodiac Signs: నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశి ఉందా..?
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Apr 21, 2024 | 6:58 AM

ప్రస్తుతం మీన రాశిలో నీచ స్థితిలో, వక్రగతిలో సంచారం చేస్తున్న బుధ గ్రహం వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 9 వరకూ మీన రాశిలో ఉండే బుధుడి వల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందడమే కాకుండా, విస్తరించడం, పెట్టుబడులు పెరగడం వంటివి కూడా జరుగుతాయి. ఉద్యో గంలో కూడా ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభించి జీతభత్యాలు పెరిగే అవకాశముం టుంది. కొత్తగా ఆస్తులు కొనడం, రియల్ ఎస్టేట్ వంటివి వృద్ధి చెందడం జరుగుతుంది. కుటుంబ జీవితం కూడా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారికి ఇది అనేక విధాలుగా శుభ ఫలితాలనిస్తుంది.

  1. మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో బుధుడు నీచబడినందువల్ల విపరీతమైన ఆదాయ వృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు వృద్ధి చెందడంతో పాటు విస్తరించడం కూడా జరుగుతుంది. ఖర్చులు తగ్గడం, పొదుపు పాటించడం జరుగుతుంది. ఇతరులతో చర్చలు, వాదోపవాదాలు, ఒప్పందాలు వంటి విషయాల్లో తప్పకుండా విజయాలు వరిస్తాయి. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాదఝించడం జరుగుతుంది. అప్రయత్న ధన లాభం కూడా ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశినాథుడైన బుధుడు దశమ కేంద్రంలో నీచబడినందువల్ల నష్టాల కంటే ఎక్కువగా లాభాలే అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలవారికి బాగా కలిసి వస్తుంది. వీరి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారమవుతుంది. ఎటువంటి వ్యాపారమైనా లాభా లపరంగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వీరిలోని ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి.
  3. సింహం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో బుధుడు నీచబడడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగ జీవితంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వీరి సలహాలు, సూచన లకు ప్రాధాన్యం ఉంటుంది. కౌన్సెలింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, రవాణా వంటి రంగాలకు చెంది నవారు దాదాపు కుబేరులవుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విపరీతమైన ధన లాభానికి అవకాశముంది. సంపన్న కుటుంబంలో ప్రేమలు, పెళ్లిళ్లు జరగవచ్చు.
  4. కన్య: ఈ రాశినాథుడైన బుధుడు సప్తమంలో నీచబడడం వల్ల జీవిత భాగస్వామి వల్ల కలిసి రావడం, భాగస్వామ్య వ్యాపారాలు వృద్ధి చెందడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి జరుగు తాయి. మాతృమూలక లేదా స్త్రీమూలక ధన లాభానికి అవకాశముంది. ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా కొత్తగా వ్యాపారాల్లో ప్రవేశించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లోనే కాకుండా ఉద్యో గంలో కూడా స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో బుధుడు నీచబడడం వల్ల గృహ, వాహన సౌకర్యాలు కొత్తగా అమ రడం గానీ, వృద్ధి చెందడం గానీ జరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి, లాటరీలో విజయం సాధించడానికి, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనివ్వడానికి అవ కాశం ఉంది. కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
  6. మీనం: ఈ రాశిలో బుధుడు నీచబడి ఉన్నందువల్ల ఏ రంగంలో ఉన్నా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగు తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి ఉపశ మనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడు తుంది. అనేక విధాలుగా, అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వికసిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు గడిస్తాయి.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ