Numerology: ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు.. పెళ్లయ్యాక భర్తకు అదృష్టాన్నిఇస్తారట

న్యూమరాలజీ అనేది  జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు న్యూమరాలజీలో ప్రస్తావించారు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తి స్వభావం, ప్రవర్తన, భవిష్యత్తు, మరెన్నో తెలుసుకోవచ్చు. సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలోని ఒడిదుడుకులతో పాటు భవిష్యత్తులో జరగబోయే విషయాలను జనన సంఖ్య ఆధారంగా తెలుసుకోవచ్చు.

Numerology: ఈ  తేదీలో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు.. పెళ్లయ్యాక భర్తకు అదృష్టాన్నిఇస్తారట
Numerology
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2023 | 10:04 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశుల కదలికలు ప్రతి వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాల కదలికలు అన్ని రాశులపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కూడా వీటన్నింటిని ఎదుర్కోవడానికి మార్గాలు ఉన్నాయి. అదే సమయంలో న్యూమరాలజీ అనేది  జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు న్యూమరాలజీలో ప్రస్తావించారు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తి స్వభావం, ప్రవర్తన, భవిష్యత్తు, మరెన్నో తెలుసుకోవచ్చు. సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలోని ఒడిదుడుకులతో పాటు భవిష్యత్తులో జరగబోయే విషయాలను జనన సంఖ్య ఆధారంగా తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు ఎవరైనా నెలలోని  9, 18 లేదా 27వ తేదీల్లో జన్మించినట్లయితే.. వారి జనన సంఖ్య 9. అదే విధంగా అన్ని తేదీలు లెక్కిస్తారు. ఈ రోజు మనం నెల 2, 11 లేదా 20 తేదీల్లో పుట్టిన స్త్రీల వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం.. ఈ తేదీలో పుట్టిన యువతి జనన సంఖ్య 2. ఈ జనన సంఖ్య గల మహిళలు న్యూమరాలజీ ప్రకారం జీవిత భాగస్వామికి మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి కూడా చాలా అదృష్టవంతులు.

2 జనన సంఖ్య గల మహిళల స్వభావం

  1. 2 సంఖ్య ఉన్న స్త్రీలను చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ మహిళలకు లక్ ఎప్పుడూ కలిసి వస్తుందట. ఈ మహిళలు తమ భాగస్వామికి అదృష్టాన్ని తెస్తారు. అంతేకాదు భర్తకు చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. భర్త ఉన్నత స్థాయికి చేరుకుంటారట.
  2. అంతేకాదు 2 జనన సంఖ్య గల స్త్రీలు స్వతహాగా చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వీరి భాగస్వాములతో త్వరగా భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు. ఈ కారణంగా.. వీరు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు.
  3. ఈ అమ్మాయిలకు సంబంధాలను ఎలా నిర్వహించాలో బాగా తెలుసు. అందుకే అత్తమామలు ఆమెను ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు అత్తారింట్లో ఆమెకు మంచి కోడలు అని పేరు. ఈ జనన సంఖ్యల రెండు గల మహిళలకు బంధాన్ని, సంబంధాన్ని ఎలా కొనసాగించాలో బాగా తెలుసు.
  4.  ఈ అమ్మాయిలు కొంచెం ఎమోషనల్‌గా ఉంటారు.  ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ స్వభావం వల్ల చాలాసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడతారు. కొన్నిసార్లు చిన్నబుచ్చుకుంటారు.
  5. ఈ జనన సంఖ్య గల అమ్మాయిలు ఆదర్శప్రాయులు. సంప్రదాయాన్ని అనుసరించడానికి ఇష్టపడతారు. ఈ స్వభావం కారణంగా వారు తమ కుటుంబంలోని సభ్యులందరి పట్ల చాలా దయగా ఉంటారు. తమ ఫ్యామిలీ సభ్యులను మాత్రమే కాదు తమ కింద పనిచేసేవారిని కూడా శ్రద్ధగా చూస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)