Zodiac Signs: లాభ స్థానంలో శుభ గ్రహాలు.. ఇక ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మలుపులు పక్కా..!

సాధారణంగా లాభ స్థానం, అంటే 11వ స్థానం పదోన్నతులను, ఆశయ సిద్ధిని, కోరికలు నెరవేరడాన్ని సూచిస్తుంది. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా శుభ ఫలితాలనే ఇస్తుందని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతోంది. లాభ స్థానంలో శుభ గ్రహాలు ఉంటే మరీ మంచిది. లాభస్థానంలో ఏదైనా గ్రహం ఉన్నా, లాభస్థానాన్ని ఏదైనా గ్రహం చూసినా తప్పకుండా లాభ స్థాన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

Zodiac Signs: లాభ స్థానంలో శుభ గ్రహాలు.. ఇక ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మలుపులు పక్కా..!
Astrology 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 10, 2024 | 7:42 PM

సాధారణంగా లాభ స్థానం, అంటే 11వ స్థానం పదోన్నతులను, ఆశయ సిద్ధిని, కోరికలు నెరవేరడాన్ని సూచిస్తుంది. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా శుభ ఫలితాలనే ఇస్తుందని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతోంది. లాభ స్థానంలో శుభ గ్రహాలు ఉంటే మరీ మంచిది. లాభస్థానంలో ఏదైనా గ్రహం ఉన్నా, లాభస్థానాన్ని ఏదైనా గ్రహం చూసినా తప్పకుండా లాభ స్థాన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం, ప్రస్తుతం మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి జీవితాలు కొత్త మలుపులు తిరగబోతున్నాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా, ఆర్థిక పరంగా, సంతానపరంగా కూడా పదోన్నతులు రావడం, హోదా పెరగడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి. వీటి ఫలితాలు నెలాఖరు వరకు అనుభవానికి వస్తాయి.

  1. మేషం: ప్రస్తుతం ఈ రాశికి లాభస్థానమైన కుంభంలో మూడు గ్రహాలు సంచారం చేస్తుండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, అధికార యోగానికి బాగా అవకాశాలున్నాయి. ఆర్థికంగా విశేషమైన పురోగతి ఉంటుంది. నిరుపేద వ్యక్తి సైతం ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరు కుంటారు. సంతానం లేనివారికి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. సామాజిక హోదా పెరగడంతో పాటు సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
  2. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, రాహువుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో వేగంగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. పోటీదార్లను, ప్రత్యర్థులను మించిపోవడం, అందలాలు ఎక్కడం జరు గుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ పని చేపట్టినా ఆర్థికంగా బాగా లాభిస్తుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితా లనిస్తాయి. సంతానం లేని వారు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
  3. మిథునం: ఈ రాశివారికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల, లాభ స్థానాన్ని శనీశ్వరుడు వీక్షించడం వల్ల కొద్ది శ్రమతో సంపద బాగా వృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైన ఒప్పందాలను కుదర్చుకుంటారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
  4. తుల: ఈ రాశికి లాభ స్థానం మీద గురువు, శని, రాశ్యధిపతి శుక్రుడి దృష్టి పడడంతో అనేక విధాలుగా, అనేక మార్గాల్లో ఈ రాశివారు ఆర్థికంగా పురోగతి చెందడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జీత భత్యాలు కూడా వృద్ధి చెందుతాయి. కొత్త నిర్ణయాలకు, ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి 11వ స్థానం మీద రాశ్యధిపతి గురువు దృష్టే ఉన్నందువల్ల మరో నెలన్నర రోజుల వరకు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరు తాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచ నాలకు మించిన పురోగతి లభిస్తుంది. పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.
  6. మకరం: ఈ రాశికి లాభస్థానమైన వృశ్చిక రాశి మీద రాశ్యధిపతి శనీశ్వరుడి దృష్టి పడినందువల్ల, అనేక మార్గాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. పదోన్నతులకు, అధికార యోగానికి కూడా బాగా అవకాశం ఉంది. సంతాన యోగం ఉంది. నిరుద్యోగులు, అవివాహితులకు అంచనాలకు మించిన శుభ యోగాలు పట్టే సూచనలున్నాయి. విదేశాల నుంచి మంచి అనూహ్యమైన ఆఫర్లు అందుతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఆశించిన పురోగతి ఉంటుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?