Zodiac Signs: వారికి వచ్చే నెల రోజులు పట్టిందల్లా బంగారమే.. ఆ నాలుగు రాశుల వారిలో మీరున్నారా?
Astrology in Telugu: జ్యోతిష శాస్త్రం ప్రకారం చరరాశుల్లో ఉన్నప్పుడు శుభగ్రహాలకు బలం పెరుగుతుంది. చర రాశుల్లో ఉన్న శుభ గ్రహాలు చురుకుగా, వేగంగా శుభ ఫలితాలను ఇస్తాయి. చర రాశులంటే మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు. ఈ రాశుల వారికి ఈ నెల రోజుల కాలంలో గురు, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు పూర్తిస్థాయిలో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
Astrology in Telugu: జ్యోతిష శాస్త్రం ప్రకారం చరరాశుల్లో ఉన్నప్పుడు శుభగ్రహాలకు బలం పెరుగుతుంది. చర రాశుల్లో ఉన్న శుభ గ్రహాలు చురుకుగా, వేగంగా శుభ ఫలితాలను ఇస్తాయి. చర రాశులంటే మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు. ఈ రాశుల వారికి ఈ నెల రోజుల కాలంలో గురు, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు పూర్తిస్థాయిలో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఆయా రాశుల వారు చేస్తున్న ప్రయత్నాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది విజయవంతం అవడానికే ఎక్కువ అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ నాలుగు రాశులు కాకుండా స్థిర, ద్విస్వభావ రాశుల వారికి ఇచ్చే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా చర రాశుల వారికి ఇచ్చే ఉత్తమ ఫలితాలను పరిశీలిద్దాం.
- మేష రాశి: ఈ రాశి వారికి ఎక్కువగా వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఈ రాశి వారికి తప్పకుండా అదృష్టం పట్టే అవకాశం ఉంది. గురు, బుధ, శుక్ర, చంద్ర గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారి ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఆర్థిక ప్రయత్నాలు అతి వేగంగా ఉత్తమ ఫలితా లను ఇస్తాయి. ఉద్యోగం విషయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. టెక్నాలజీ నిపుణులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరగడం జరుగుతుంది. మొత్తం మీద జీవితంలో సానుకూల పరిణామాలు, శుభపరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి కూడా శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. దీని ఫలితంగా అష్టమ శని ప్రభావం చాలా వరకు తగ్గి, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఇల్లు కొనాలన్న కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన విధంగా పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడటం మొదలవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం కనిపిస్తుంది. లాటరీ, జూదం, షేర్లు, వడ్డీ వ్యాపారం, కన్సల్టెన్సీ వంటివి ఆర్థికంగా ప్రయోజనం కలిగిస్తాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి.
- తులా రాశి: ఈ రాశి వారికి గురు, బుధ, శుక్ర గ్రహాల అనుగ్రహం పూర్తిస్థాయిలో ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినప్పటికీ అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఉద్యోగ స్థానంలో ఉన్న శుక్ర గ్రహం వల్ల ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోవటంతో పాటు అధికారం చేపట్టడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం అన్ని విధాలుగాను సహకరిస్తుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. నిరుద్యోగులు తప్పకుండా మంచి సంస్థలో స్థిరపడే అవకాశం ఉంది.
- మకర రాశి: ఈ రాశి వారికి నాలుగో స్థానంలో సంచరిస్తున్న గురువు, ఏడవ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు, దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడు ఉద్యోగ పరంగానే కాక కుటుంబ పరంగా కూడా సుఖ సంతోషాలను ఇవ్వటానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో విశేషమైన పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థి తులు చాలావరకు మెరుగుపడతాయి. ముఖ్య మైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆరోగ్య పరిస్థితిలో సానుకూలమైన మార్పు చోటు చేసుకుంటుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..