Monthly Horoscope (June 2023): మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది.. 12 రాశులవారికి జూన్‌లో మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Monthly Horoscope (June 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి జూన్ మాసంలో 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

| Edited By: Janardhan Veluru

Updated on: May 31, 2023 | 12:02 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశి వారికి బుధ, శుక్ర, గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలలో కొద్దిగా రాజయోగం అనుభవించే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయవంతం కావడం, ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ అనుకూల పరిస్థితులు అనుభవానికి రావడం వంటివి జరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏ విధమైన లోటు ఉండదు. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు టెక్నాలజీ నిపుణులు వంటి వృత్తుల వారు తప్పకుండా పురోగతి చెందే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానయోగం కలిగే అవకాశం కూడా ఉంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఉద్యోగులకు దూరప్రాంతం నుంచి మంచి ఆఫర్ అందవచ్చు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. నమ్మించి మోసగించే స్నేహితులు ఉంటారు.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశి వారికి గురు గ్రహం కారణంగా శుభకార్యాల మీద బాగా వ్యయం అయ్యే అవకాశం ఉంది. అయితే బుధ శుక్ర గ్రహాల కారణంగా సంపాదన బాగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుని జీవితం ఒక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగానే కలిసి వస్తాయి. క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని విధాలుగాను ఆక్టివిటీ పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయంగా కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశి వారికి మూడు శుభగ్రహాలు అనుకూలంగా ఉండటంతో పాటు శనీశ్వరుడి అనుగ్రహం కూడా ఉన్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి కూడా ఇతరులకు వీలైనంతగా సహాయం చేసే స్థితికి చేరుకుం టుంది. అదనపు ఆదాయ మార్గాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఏ విషయంలోనూ బద్దకించవద్దు. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారు సరికొత్త అవకాశాలతో ముందుకు దూసుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశి వారికి గురు శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అష్టమ శని ప్రభావం కూడా బాగా తగ్గి కొన్ని మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కాపాడుకోవడం, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం వంటివి మాత్రం చాలా ముఖ్యం. వృత్తి, ఉద్యోగాల పరంగా జీవితం మరికొంత పురోగతి సాధించే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు స్వయం ఉపాధి కూడా ఆశాజనకంగా కనిపిస్తాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుని సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లలు తమ చదువుల్లో శుభవార్తలు మోసుకొస్తారు. పెళ్లి సంబంధం కుదరటం నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గురు, బుధ గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఈ నెల అంతా చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, పెళ్లి కాని వారికి పెళ్లి నిశ్చయం కావడం అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొద్దిగా సఫలం కావడం వంటివి జరుగుతాయి. మొత్తం మీద ప్రస్తుత అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. సంతానపరంగా శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే ఆహార విహారాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశి వారికి బుధ శని గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నందువల్ల శ్రమ, తిప్పటలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఈ పనుల వల్ల ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. కుటుంబంలో భారీ ఖర్చుతో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఇతరుల బాధ్యతలను మీద వేసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. డబ్బు సహాయం పొందిన వారు తప్పించుకుని తిరిగే అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెంచుతారు. వృత్తి జీవితం ఆశాజనకంగా ముందుకు సాగుతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశి వారికి గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా స్థిరత్వం లభించవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విలాసాలలో మునిగి తేలుతుంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో డిమాండ్ తో పాటు గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. చిన్న వ్యాపారాలు స్వయం ఉపాధి వంటివి చాలావరకు పురోగతి సాధి స్తాయి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చక పోవడం చాలా మంచిది. అపనిందలు పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా ఉత్సాహంగా సాగిపోతుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ): ఈ రాశి వారికి ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటాయి. అయితే ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం శ్రేయస్కరం కాదు. ఆర్థిక విషయాలలో స్నేహితులు సైతం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ప్రతిరోజు ఉదయం లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ప్రస్తుతానికి ఉద్యోగ పరంగా మార్పు కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా మంచిది. అవసర సమయాల్లో ఒకరిద్దరు బంధువులు ఆదుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ధను రాశి వారికి గురు శుక్ర గ్రహాలతో పాటు శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ, వ్యాపార, వివాహ సంబంధమైన ప్రయత్నాలు తప్పకుండా సానుకూలపడతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వేతన భత్యాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాలు కూడా విశేషంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆహార విహారాలకు సంబంధించిన నియమాలు పాటించడం మంచిది. ఇతరులకు ఆర్థిక బాధ్యతలు అప్పగించడం ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. ఆర్థిక లావాదేవీల వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. లాటరీలు జూదాలు షేర్లు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పెద్దల సహాయ సహకారాలతో ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యం జరగటానికి అవకాశం ఉంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): శని, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొద్ది జాగ్రత్తలు పాటించే పక్షంలో ఈ నెల అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సమీప బంధువుల జోక్యంతో ఒక ప్రధానమైన కుటుంబ సమస్య కూడా ఒక కొలిక్కి వస్తుంది. ఇతరుల వ్యవహారాలలో తల దూర్చకపోవడం చాలా మంచిది. ఉద్యోగంలో సహచరులకు సహాయ పడటం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

10 / 12
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశి వారికి ఒక్క బుధ గ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ రాశి వారి నిర్ణయాలు, ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలను ఇస్తాయి. అయితే కొందరు స్నేహితులను నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆహార నియమాలు పాటించడం మంచిది. కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): గురు శుక్ర గ్రహాల అనుకూల సంచారం కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగంలోనూ, వృత్తిపరంగాను గౌరవప్రదమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో డిమాండ్ బాగా పెరుగు తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కొందరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. నిరు ద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రతి చిన్న ప్రయత్నం సఫలం అవుతుంది. కుటుంబపరంగా మనశ్శాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. తీర్థయాత్రలకు గానీ, విహారయాత్రలకు గానీ వెళ్లే అవకాశం ఉంది.

12 / 12
Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో