జ్యోతిష శాస్త్రం ప్రకారం పౌర్ణమి నాడు పుట్టడమే ఒక అదృష్టం. రవి చంద్రులు ఎదురెదురు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. పౌర్ణమి రోజున చంద్ర గ్రహం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పౌర్ణమికి ముందు రోజున, తర్వాత రోజున కూడా చంద్ర గ్రహం శక్తివంతంగానే పని చేస్తుంది.
మనస్సుకు కారకుడైన చంద్రుడు బలంగా ఉన్న పక్షంలో ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థయిర్యం, పట్టుదల, దృఢ సంకల్పం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆ మూడు రోజుల్లో తలపెట్టిన పనులు సాధారణంగా పూర్తవడం జరుగు తుంది. ఈ మూడు రోజులు చాలా మంచి రోజులుగా, యోగకారక దినాలుగా పరిగణించడం జరుగుతుంది. ఏ రాశి వారి కైనా ఈ రోజులు ఏదో ఒక విధంగా మంచి చేయడమే జరుగుతుంది. ఈ రోజుల్లో ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే లేదా వ్యవహరిస్తే అంత సానుకూల వాతావరణం అనుభవానికి వస్తుంది. జూన్ నెల 4వ తేదీన పౌర్ణమి ఏర్పడుతోంది.