AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology 2025: కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!

Astro Remedies in 2025: కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి గ్రహ బలం బాగా తక్కువ ఉంది. వీరు శుభ ఫలితాల కోసం, గ్రహ శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఏడాది ప్రారంభం నుంచి ఈ పరిహారాలను పాటించే పక్షంలో తప్పకుండా ఏడాదంతా హ్యాపీగా, సాఫీగా, సాను కూలంగా సాగిపోయే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

Astrology 2025: కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
Astrology 2025
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 23, 2024 | 6:18 PM

Share

కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి గ్రహ బలం బాగా తక్కువగా ఉన్నందువల్ల శుభ ఫలితాల కోసం, గ్రహ శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ఏడాది ప్రారంభం నుంచి ఈ పరిహారాలను పాటించే పక్షంలో తప్పకుండా ఏడాదంతా హ్యాపీగా, సాఫీగా, సాను కూలంగా సాగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని, గురు, రాహుకేతువుల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. మేషం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

  1. మేషం: ఈ రాశికి ఏలిన్నాటి శని ప్రారంభమవుతున్నందువల్ల కష్టార్జితం ఎక్కువగా వృథా అయ్యే అవ కాశం ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. దుర్వార్తలు వినడం జరుగుతుంది. కుటుంబ పెద్దల అనారోగ్యాలు ఆందోళన కలిగిస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువగా శివార్చన చేయించడం, శనికి తరచూ తైలాభిషేకం చేయించడం చాలా మంచిది.
  2. సింహం: ఈ రాశివారికి అష్టమ శని ప్రారంభమవుతోంది. గురువు లాభ స్థాన ప్రవేశం వల్ల ఈ శని దోషం బాగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, విఘ్నాలు లేకుండా ఏ పనీ పూర్తయ్యే అవకాశం ఉండదు. రావలసిన డబ్బుచేతికి అందక ఇబ్బంది పడడం జరుగుతుంది. సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ రాశివారు శివ స్తోత్రం పఠించడం మంచిది. తరచూ శని జపం చేయించాల్సిన అవసరం కూడా ఉంది.
  3. కన్య: ఈ రాశికి శని సప్తమ స్థానంలో, గురువు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగాల్లో వెనుకటి ప్రాధాన్యం, ప్రాభవం తగ్గి, ఒత్తిడి, వేధింపులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు, విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరిగి, లాభాలు తగ్గే అవకాశం ఉంది. దత్తాత్రేయ స్తోత్రం, సుందరకాంఢ పారాయణం చేయడం వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి గురువు సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి మారడం వల్ల ఆదాయం బాగా తగ్గి ఖర్చులు పెరగడం జరుగుతుంది. ఆదాయ మార్గాలలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావా దేవీలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఇటు వంటి సమస్యల నుంచి విముక్తికి దత్తాత్రేయ స్తోత్రపఠనంతో పాటు గురు జపం చేయడం మంచిది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతున్నందువల్ల సుఖ సంతోషాలు కొద్దిగా తగ్గే అవ కాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలకు, ఆస్తిపాస్తుల క్రయ విక్రయాలకు ఆటంకాలు ఏర్పడ తాయి. కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో అని శ్చిత పరిస్థితులు, అభద్రత ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు తగ్గుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి సుందరకాండ పారాయణం శ్రేయస్కరం.
  6. మీనం: ఈ రాశిలో శని ప్రవేశించడం వల్ల, గురువు చతుర్థ స్థాన ప్రవేశం వల్ల ఇంతవరకూ అనుభవించిన ప్రాభవం, ప్రాధాన్యం క్రమంగా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో సమస్యలు చోటు చేసుకుం టాయి. శారీరక సుఖం తగ్గి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రతికూలతలు పెరుగు తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడ తాయి. వీటి నుంచి బయటపడేందుకు ప్రతి రోజూ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం మంచిది.