Astro Tips: మీ జాతకంలో వంచన చోర భీతి యోగం ఉందా.. చేయాల్సిన నివారణ చర్యలు ఏమిటంటే?

యోగాలు 300 రకాలున్నాయి. ఇవి వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశిస్తాయని విశ్వాసం. ఈ యోగాల్లో ఒకటి  వంచన చోర్ భీతి యోగ. వంచన చోర భీతి యోగ అనేది ఒక దుష్ట యోగా.. దీని ప్రభావం స్థానికుడిని చాలా మతిస్థిమితం లేని వ్యక్తిగా చేస్తుంది. ఎవరి జాతకంలో ఈ యోగా ఉంటుందో.. ఆ వ్యక్తి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు.

Astro Tips: మీ జాతకంలో వంచన చోర భీతి యోగం ఉందా.. చేయాల్సిన నివారణ చర్యలు ఏమిటంటే?
Vanchana Chora Bheethi Yoga
Follow us
Surya Kala

|

Updated on: Apr 24, 2023 | 11:31 AM

ప్రతి వ్యక్తి జీవితంపై రాశుల ప్రభావం ఉంటుందని.. జాతకంలో అనేక రకాల యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నారు. ఈ యోగాలు 300 రకాలున్నాయి. ఇవి వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశిస్తాయని విశ్వాసం. ఈ యోగాల్లో ఒకటి  వంచన చోర్ భీతి యోగ. వంచన చోర భీతి యోగ అనేది ఒక దుష్ట యోగా.. దీని ప్రభావం స్థానికుడిని చాలా మతిస్థిమితం లేని వ్యక్తిగా చేస్తుంది. ఎవరి జాతకంలో ఈ యోగా ఉంటుందో.. ఆ వ్యక్తి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. వీరి మనసులో మన వస్తువులు ఏవైనా పోతాయానో, దొంగిలిస్తారనో భయం ఎల్లప్పుడూ ఉంటుంది.  ఏ పని చేసినా మనసులో ఆందోళన ఉండడం మానవ సహజం. అయితే శుభకార్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు భయపడడం సరికాదు. అయితే ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు గందరగోళానికి గురైతే..  ఖచ్చితంగా ఈ చర్యలు చేయండి. ఈ చర్యలు చేయడం ద్వారా, పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నారు.

మీరు ఏదైనా ప్రత్యేకమైన, అవసరమైన పని కోసం ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లయితే.. ఇంటి నుండి బయలుదేరే ముందు సర్వోన్నతుడైన భగవంతుడిని భక్తితో పూజించండి. పూజ చేసే సమయంలో దీపం వెలిగించండి. అదే సమయంలో సురక్షితమైన ప్రయాణం .. వెళ్తున్న పనిలో విజయం కోసం దేవుడిని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు దూరం అవుతాయి.

పనిలో విజయం, సాఫల్యం పొందడానికి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నల్ల చీమలకు చక్కెర లేదా పిండిని ఆహారంగా అందించండి. అంతే కాదు పక్షులకు ధాన్యం, నల్ల కుక్కలకు రొట్టెలు, ఆవుకు ఆహారం పెట్టడం కూడా శ్రేయస్కరం. అదే సమయంలో దారిలో కనిపించే ఏదైనా ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని హుండీలో డబ్బును కానుకగా వేయండి. ఇలా చేయడం వలన చేపట్టిన పనిలో కచ్చితంగా విజయం లభిస్తుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం..  పంచాంగంలో శుభ ఘడియల సమయం చూసి అనంతరం ఇంటిని బయటకు వెళ్లడం శ్రేయస్కరం. ఇలా చేయడం వలన చేపట్టిన పనిలో ఖచ్చితంగా  విజయం లభిస్తుంది. దీనితో పాటు ప్రయాణం కూడా సురక్షితంగా సాగుతుంది.

ఏ పనులు చేయకూదంటే.. 

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పొరపాటున కూడా అగ్నిని, గాలిని, నీటిని అంటే నదిని అవమానించకండి. ఇవి భగవంతుడు మనిషికి ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. పంచభూతాలను అవమానిస్తే.. దేవుడు కోపిస్తాడని విశ్వాసం.

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళం, రాయి, రావణుడు, చనిపోవడం, మునిగిపోవడం, విసిరేయడం, వెళ్లడం, దుర్భాషలాడడం, చెప్పులు, కలప అనే పదాలను ఉచ్చరించవద్దు.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).