Sun Transit 2023: మొదలైన బుధాదిత్య యోగం.. ఈ 20 రోజులు ఈ ఐదు రాశులకు డబ్బే డబ్బు.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
ఇటీవల సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. భానుడు మే 15 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఇప్పటికే అక్కడ ఉన్న బుధుడితో కలిసి సూర్యుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాడు. అంతేకాదు మేషరాశిలో రాహువు, గురువు, యురేనస్ కలిసి ఉన్నాయి. దీంతో పంచగ్రహి యోగం ఏర్పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాలకు రాజు సూర్యభగవానుడు గా పిలుస్తారు. ఇటీవల సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. భానుడు మే 15 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఇప్పటికే అక్కడ ఉన్న బుధుడితో కలిసి సూర్యుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాడు. అంతేకాదు మేషరాశిలో రాహువు, గురువు, యురేనస్ కలిసి ఉన్నాయి. దీంతో పంచగ్రహి యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ 20 రోజులు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే అని అంటున్నారు. ఆ రోజు ఆ లక్కీ రాశులేమిటో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశిలో సూర్యుడు సంచారం వల్ల శుభం కలుగుతుంది. బుధాదిత్య యోగం వలన ఈ రాశి వ్యక్తులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారులు శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారు తమ ప్రేమని సక్సెస్ చేసుకుంటారు. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది.
మిథున రాశి: బుధాదిత్య యోగం వలన ఈ రాశివారికి మేలు జరుగుతుంది. చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో కొత్త అవకాశాలను లభిస్తాయి. విదేశీ ప్రయాణం అనుకూల సమయం.
కర్కాటక రాశి: సూర్య గోచారం ఈ రాశి వారికి వృత్తిలో పురోభివృద్ధి జరుగుతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విదేశాల్లో చదువు కోవాలనుకునే విద్యార్థులు కోరిక నెరవేరుతుంది. జీవితం సంతోషముగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషలు నెలకొంటాయి.
సింహ రాశి: ఈ రాశివారికి సూర్యుడే అధిపతి. ఆర్ధికంగా లాభాలు ఆర్జిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి, సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాస్తు అభివృద్ధిలో అభివృద్ధి ఉంటుంది. మెుత్తానికి సుఖ సంతోషాలతో జీవిస్తారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి బుధాత్యయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. పనికి తగిన ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులు ధనాన్ని ఆర్జిస్తారు. జీవితం సంతోషంగా సాగుతుంది.
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).