AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Temple: అయోధ్యలో 155 దేశాల నీళ్లతో రామయ్యకు జలాభిషేకం, హాజరుకాని రాజ్ నాథ్ సింగ్, సీఎం యోగి

రామయ్యకు జరిగిన జలాభిషేకంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఇద్దరూ ఈ  కార్యక్రమంలో పాల్గొనలేదు. విదేశాల నుంచి 155 దేశాలకు చెందిన ఎన్నారైలు, రాయబారులు కూడా జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని రామమందిరం ప్రాంగణంలో ప్రార్థనలు చేశారు.

Ayodhya Temple: అయోధ్యలో 155 దేశాల నీళ్లతో రామయ్యకు జలాభిషేకం, హాజరుకాని రాజ్ నాథ్ సింగ్, సీఎం యోగి
Ayodhya Ram Temple
Surya Kala
|

Updated on: Apr 24, 2023 | 8:00 AM

Share

ఉత్తర ప్రదేశ్ లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో 155 దేశాల నదుల నీటితో రామయ్యను అభిషేకించారు. అంతకుముందు జలాభిషేకానికి 155 దేశాల నుంచి నీరు అయోధ్యకు చేరుకుంది. అయోధ్య కాంట్ రైల్వే స్టేషన్‌లో 155 దేశాల నుంచి వచ్చిన నీళ్లకు ఘన స్వాగతం లభించింది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకర్త ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలో 155 దేశాలోని పవిత్ర నదుల నుంచి సేకరించిన నీరు అయోధ్యకు చేరుకుంది. అయోధ్య రైల్వేస్టేషన్‌కు నదీజలాలు చేరుకోగానే జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి, ప్రజలు నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ అయోధ్యలోకి ఆ నదీజలాలను తీసుకుని వచ్చారు. 155 దేశాల నుంచి నీటిని తీసుకొచ్చి.. రామయ్యకు అభిషేకం చేసే సాంప్రదాయం 3 సంవత్సరాల క్రితం అంటే 2020లోనే ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా 155 దేశాల నదుల నుంచి జలాన్ని సేకరించి రామజన్మభూమికి తరలించారు. శ్రీ రాముడికి జలాభిషేకం నిర్వహించారు.

ఢిల్లీకి చెందిన ఎన్జీవో ‘ఢిల్లీ స్టడీ గ్రూప్’ సభ్యులు, ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విజయ్ జాలీ నేతృత్వంలో ఎన్నారైల బృందం, వివిధ దేశాల రాయబారుల సమక్షంలో రామజన్మభూమిలో 155 కలశాలతో సీతారాములకు జలాభిషేకం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

జలాభిషేకంలో పాల్గొనని రక్షణ మంత్రి, సీఎం యోగి   మరోవైపు రామయ్యకు జరిగిన జలాభిషేకంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఇద్దరూ ఈ  కార్యక్రమంలో పాల్గొనలేదు. విదేశాల నుంచి 155 దేశాలకు చెందిన ఎన్నారైలు, రాయబారులు కూడా జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని రామమందిరం ప్రాంగణంలో ప్రార్థనలు చేశారు.

జలాభిషేకంలో ఆయా దేశాల రాయబారులు ఫిజీ, మంగోలియా, డెన్మార్క్, భూటాన్, రొమేనియా, హైతీ, గ్రీస్, కొమొరోస్, కాబో వెర్డే, మాంటెనెగ్రో, తువాలు, అల్బేనియా, టిబెట్ దేశాల రాయబారులు రామాలయంలో జరిగిన ఈ చారిత్రాత్మక జలాభిషేకంలో  పాల్గొన్నారు. దీంతో పాటు భూటాన్, సురినామ్, ఫిజీ, శ్రీలంక, కంబోడియా వంటి దేశాల అధినేతలు కూడా రాంలాలా జలాభిషేకం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

అయోధ్యకు చేరుకున్న ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్ నదుల నీరు మొఘల్ చక్రవర్తి బాబర్ జన్మస్థలమైన ఉజ్బెకిస్థాన్‌లోని ఆండీజన్ నగరం నుండి ప్రసిద్ధ కషక్ నది పవిత్ర జలం కూడా జలాభిషేక కోసం అయోధ్యకు చేరుకుందని ..  జలాభిషేక కార్యక్రమం సమన్వయకర్త విజయ్ జాలీ పేర్కొన్నారు. దీంతో పాటు యుద్ధంలో అతలాకుతలమైన రష్యా, ఉక్రెయిన్, చైనాలతో పాటు పాకిస్థాన్ నుంచి కూడా నీటిని తీసుకొచ్చామని చెప్పారు.

రామయ్య జలాభిషేక కార్యక్రమం ప్రజలకు శ్రీరాముడి ఆశయాల పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పవిత్ర జలాన్ని సేకరించడానికి రెండున్నరేళ్లకు పైగా పట్టిందని ఆయన అన్నారు.

ఈ జలాభిషేకంలో 155 దేశాల నదుల నీటితో పాటు ఆత్మబల శాఖ భగవాన్ నిషాద్ రాజ్ జీ నగరమైన శృంగవేర్‌పూర్ ధామ్‌లోని నీటిని కూడా వినియోగించారని ఇది.. ఎంతో ఉద్వేగభరితమైన ఘట్టం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం అని చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..