Astrology: ఆ రాశుల వారిదే శత్రు జయం.. మీకు శత్రు భయం నుంచి విముక్తి కలిగేది ఎప్పుడంటే..?
Astrology in Telugu: జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో ఆరవ స్థానాన్ని బట్టి శత్రువుల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఏ గ్రహమైనా శత్రువుల పాత్ర పోషించవచ్చు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శని, గురు గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉంటే శత్రు బాధ చాలావరకు తగ్గుతుంది.
చాలామందికి శత్రు బాధ భరించరానిదిగా ఉంటుంది. పక్కలో బల్లెంలాగా ఇబ్బందిపెడుతుంటారు. పైగా ఒక్కొక్కసారి శత్రువులు ఏ రూపంలో ఉంటారో, వారి వ్యూహాలు, వారి ఆంతర్యం ఏమిటో చెప్పలేం కూడా.. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో ఆరవ స్థానాన్ని బట్టి శత్రువుల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఏ గ్రహమైనా శత్రువుల పాత్ర పోషించవచ్చు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శని, గురు గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉంటే శత్రు బాధ చాలావరకు తగ్గుతుంది. ఈ ఏడాది వివిధ రాశుల వారికి ఈ శత్రు బాధ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా తగ్గుతుందో పరిశీలిద్దాం..
- మేషం: ఈ రాశివారికి బుధ గ్రహం ఆరవ స్థానాధిపతి అయినందువల్ల ఏ రంగంలో అయినా, ఏ వృత్తిలో అయినా పోటీదార్లు ఎక్కువగా ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో వీరి వల్ల తరచూ ఇబ్బందులు ఎదు ర్కోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి గురు, శనులు ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల శత్రువులు లేదా పోటీదార్లు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ప్రస్తుతం రాహువు కూడా సంచరిస్తున్నందువల్ల రహస్య శత్రువులకు అవకాశం ఉంది.
- వృషభం: సాధారణంగా ఈ రాశివారికి సొంతవారి నుంచే సమస్యలుంటాయి. బంధువులు, స్నేహితులు వెనుక నుంచి దుష్ప్రచారాలు సాగించడం, వదంతులు పుట్టించడం, అప్రతిష్టపాలు చేయడం వంటివి యథాశక్తి జరుగుతూ ఉంటాయి. అయితే, ఈ రాశివారిని దెబ్బతీయడం చాలా కష్ట సాధ్యమైన విషయం. విచిత్రంగా, వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కూడా వీరిని చూసి ఈర్ష్య పడడం జరుగుతుంటుంది. ఈ శత్రు బాధ విషయంలో ఈ ఏడాది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- మిథునం: ఈ రాశివారికి సహచరుల నుంచి, రక్త సంబంధీకుల నుంచి ఎక్కువగా సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖాముఖీ శత్రుత్వాలకు అవకాశం ఉండదు కానీ, కుట్రలు, కుతంత్రాల ద్వారా దెబ్బతీయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రాశివారు కొద్ది కాలం పాటే తామే శత్రువుల మీద దాడి చేసే సూచనలున్నాయి. అంతేకాక, స్నేహితుల్లో కొందరు రహస్య శత్రువులుగా మారే అవ కాశం కూడా ఉంది. ఈ ఏడాది ఈ రాశివారిని శత్రువులు దెబ్బతీసే అవకాశం ఉండకపోవచ్చు.
- కర్కాటకం: ఈ రాశివారికి శత్రు బాధ జీవితాంతం ఉంటుందని చెప్పవచ్చు. చాలా చిన్న విషయాలకు సైతం వీరిని చూసి అసూయపడేవారుంటారు. శత్రువులు మిత్రులుగా మారడం, మిత్రులు శత్రువులుగా మారడం వీరి విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది. సొంతవారిలో కూడా వీరికి శత్రువులుంటారు. నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం ఉంది. శత్రు స్థానాధిపతి అయిన గురు గ్రహం ఈ రాశికి దశమ స్థానంలో ఉన్నందువల్ల, సహచరుల వల్ల బాగా ఇబ్బందిపడే అవకాశముంది.
- సింహం: ఈ రాశివారికి శత్రువులు ఏర్పడడమే కష్టం. శత్రువులు తయారైతే మాత్రం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. శత్రువులు బంధువుల్లోనూ, తన కింద పని చేసేవారిలోనూ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా తన కింద పని చేసేవారి నుంచి సహాయ సహకారాలు లభించవు. ఆరవ స్థానాధిపతి శనీశ్వరుడు ఈ రాశి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినందువల్ల ఈ ఏడాది శత్రు బాధలు పెరిగే సూచనలున్నాయి. శత్రు బాధలు పెరిగినా ఈ రాశివారికి సమస్యలు ఉండక పోవచ్చు.
- కన్య: ఈ రాశివారికి శత్రువులతో ఎక్కువగా సమస్యలు ఉండకపోవచ్చు. పోటీదార్లు మాత్రం శక్తివంతులై ఉండే అవకాశం ఉంది. శత్రువులైనా, పోటీదార్లయినా ఈ ఏడాది ఈ రాశివారి మీద గెలుపు సాధించే అవకాశం లేదు. ఈ రాశివారి వల్లే ప్రత్యర్థులకు ప్రమాదం ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా వీరికి ఈ ఏడాది పోటీదార్ల వల్ల కూడా కలిసి వస్తుంది. అసూయపడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది వీరికి శత్రు జయం ఉంది.
- తుల: ఈ రాశివారికి ఉద్యోగ స్థానంలో కంటే వృత్తి, వ్యాపారాల్లో శత్రువులు, అసూయాపరులు, పోటీదార్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల్లో కొందరు పైకి పెద్దమనుషులుగా వ్యవహరిస్తూనే అప కారం తలపెట్టడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. వీరి పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించే వారుంటారు. వీరు సరదాగా ఉండడం నచ్చనివారుంటారు. ఈ ఏడాది వీరిని ఇబ్బందులపాలు చేయడానికి ప్రయత్నించేవారు తప్పకుండా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశివారికి కూడా సొంతవారు, రక్త సంబంధీకులే ఎక్కువగా సమస్యలు సృష్టించడం జరుగు తుంటుంది. బంధువులు, సన్నిహితులతో అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన కుజుడు ఈ ఏడాది చివరి వరకూ అనుకూల స్థానా లలో సంచరిస్తున్నందు వల్ల వీరిపై శత్రువుల వ్యూహాలు పనిచేసే అవకాశం ఉండదు. కుటుంబ పరంగా సమస్యలు సృష్టించే ప్రయత్నాలు సాగకపోవచ్చు. తప్పకుండా శత్రు జయం ఉంటుంది.
- ధనుస్సు: సాధారణంగా ఈ రాశివారికి ఇతర జెండర్ నుంచి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. పురుషు లైతే స్త్రీలు, స్త్రీలైతే పురుషులు శత్రువులుగా అవతరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఇతర జెండర్ల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారి నుంచి అసూయ పడేవారి సంఖ్య, ఏదో ఒక విధంగా ఇబ్బందిపెట్టే వారి సంఖ్య, అవమానించాలనుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల శత్రు బాధ తగ్గి ఉండడం జరుగుతుంది.
- మకరం: ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా పోటీదార్లు, అసూయపడేవారు ఎక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శత్రువులు సహచరుల రూపంలో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశివారు ఇటువంటి శత్రువుల గురించి పట్టించుకునే అవకాశం ఉండదు కానీ, శత్రువుల కారణంగా అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోవడం మాత్రం జరుగుతూ ఉంటుంది. వీరిలోని క్రమశిక్షణ, పట్టుదల, మొండి ధైర్యం వంటివి అసూయలకు కారణమవుతుంటాయి.
- కుంభం: ఈ రాశివారికి ఎక్కువగా స్వల్పకాలిక శత్రువులే తప్ప దీర్ఘకాలిక శత్రువులు ఉండే అవకాశం లేదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం సహచరులు శత్రువులుగా మారడం జరుగుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరి వల్ల తరచూ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీరి శ్రమపడే తత్వం ఈ శత్రుత్వాలకు కారణం అవుతూ ఉంటుంది. ఏలిన్నాటి శని కారణంగా ఈ ఏడాది వీరికి ఎక్కువగా శత్రు సమస్యలు ఉండడం జరుగుతుంది. సమయం అనుకూలంగా లేనందువల్ల తగ్గి ఉండడం మంచిది.
- మీనం: ఈ రాశివారికి సాధారణంగా శక్తివంతులైన శత్రువులు ఉండే అవకాశం లేదు. బలహీనులైన పోటీ దార్లు, బలహీనమైన ప్రత్యర్థులు జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. ఏదో ఒక కారణం మీద మధ్య మధ్య కొద్దిగా ఇబ్బంది పెట్టడం, వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు తరచూ ఫిర్యా దులు చేయడం, చాడీలు చెప్పడం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాక, రహస్య శత్రువులు తప్ప బహిరంగ శత్రువులకు ఆస్కారం ఉండదు. ఈ ఏడాది వీరికి శత్రు బాధ ఉండకపోవచ్చు.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి