Akhanda Raja Yoga: కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఆ రాశుల వారికి అఖండ రాజయోగం!

మేషంలో ఉచ్ఛ రవి, గురువులు, కుంభంలో స్వక్షేత్ర శని, కుజులు, మీన రాశిలో ఉచ్ఛ శుక్రుడు, బుధులు యుతి చెందడం వల్ల గ్రహ సంచారంలో ఒక అరుదైన ‘అఖండ రాజయోగం’ ఏర్పడింది. ఈ యోగం వల్ల తప్పకుండా ఆరు రాశుల వారికి బాగా అదృష్టం కలిసి వస్తుంది. అధికార యోగాలతో పాటు, భాగ్య యోగాలు కూడా ఏర్పడతాయి.

Akhanda Raja Yoga: కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఆ రాశుల వారికి అఖండ రాజయోగం!
Akhanda Raja Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 15, 2024 | 4:07 PM

మేషంలో ఉచ్ఛ రవి, గురువులు, కుంభంలో స్వక్షేత్ర శని, కుజులు, మీన రాశిలో ఉచ్ఛ శుక్రుడు, బుధులు యుతి చెందడం వల్ల గ్రహ సంచారంలో ఒక అరుదైన ‘అఖండ రాజయోగం’ ఏర్పడింది. ఈ యోగం వల్ల తప్పకుండా ఆరు రాశుల వారికి బాగా అదృష్టం కలిసి వస్తుంది. అధికార యోగాలతో పాటు, భాగ్య యోగాలు కూడా ఏర్పడతాయి. మేషం, వృశ్చికం, మకరం, కుంభం, ధనుస్సు, మీన రాశులవారి జీవితాలు ఈ యోగాల కారణంగా సానుకూల మలుపులు తిరుగుతాయి. దాదాపు ఈ నెలంతా వారికి శుభప్రదంగా సాగిపోతుంది. ఎంత ప్రయత్నిస్తే అంత, ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత వీరు లబ్ధిపొందడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశిలో గ్రహాల రారాజు అయిన రవి ఉచ్ఛపట్టడంతో పాటు, ధన కారకుడైన గురువుతో కలిసి నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా విపరీత రాజయోగం పడుతుంది. ఎక్కడ ఏ రంగంలో ఉన్న ప్పటికీ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి, అధికారానికి అవకాశం ఉంది. ఆర్థి కంగా బాగా బలం పుంజుకోవడం జరుగుతుంది. వృత్తి జీవితంలో ఆదరణ పెరుగుతుంది. వ్యాపా రాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  2. వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన రవి ఉచ్ఛపట్టడంతో పాటు గురువుతో కలిసినందువల్ల ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరిగే అవకాశముంది. ఒక సంస్థకు అధికారి అయ్యే అవకాశం కూడా కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభాల బాట పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడడం ఖాయంగా జరుగుతుంది.
  3. ధనుస్సు: రాశ్యధిపతి గురువుతో ఉచ్ఛ రవి యుతి చెందడం, చతుర్థ స్థానంలో శుక్రుడు ఉచ్ఛలో ఉండడం, తృతీయ స్థానంలో శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి ఇది దాదాపు స్వర్ణ యుగంలా గడిచిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో బాగా రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, లాభాల బాట పడతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
  4. మకరం: ఈ రాశ్యధిపతి శనీశ్వరుడు ధన స్థానంలో స్వక్షేత్ర సంచారం చేయడం, తృతీయ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల కొద్ది ప్రయత్నంతో అధికారం చేపట్టడం లేదా ఆర్థికంగా అందలాలు ఎక్కడం వంటివి తప్పకుండా జరుగుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి.ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఏ రంగంలోని వారికైనా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల ద్వారా కూడా ఆర్థికంగా లభ్ధి పొందుతారు.
  5. కుంభం: ఈ రాశిలో శని స్వక్షేత్ర సంచారం, ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, బుధులు సంచారం, తృతీయంలో ఉచ్ఛ రవి, గురువుల ఉండడం వంటి పరిణామాల వల్ల ఈ రాశివారికి మరో నెల రోజుల పాటు పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఏ రంగంలో ఉన్నా రాజయోగం పట్టడానికి అవకాశముంది. ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాలు లభిస్తాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా అభివృద్ధి చెందుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగు తుంది.
  6. మీనం: ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, మరో శుభగ్రహమైన బుధుడితో కలిసి ఉండడం, ధన స్థానంలో ఉచ్ఛ రవితో ధన కారకుడు, రాశ్యధిపతి గురువు కలవడం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగానికి అవకాశముంది. ఓ నెల రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఎటు వంటి అనారోగ్యం నుంచయినా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ మెరుగుపడు తుంది. ఈ రాశివారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. జీవితం విలాసాలతో గడిచిపోతుంది.