Zodiac Signs: రవి, శని గ్రహాల బలం.. ఇక కష్టనష్టాల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..!
తండ్రి, కుమారులైన రవి, శనులు ఒకేసారి ఉచ్ఛ, మిత్ర క్షేత్రాల్లో సంచరించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ ఈ రెండు ప్రధాన గ్రహాలు బలంగా ఉన్న పక్షంలో కష్టనష్టాల నుంచి బయటపడడం, మనసులోని కోరికల్లో కొన్నయినా నెరవేరడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభవార్తలు వినడం వంటివి తప్పకుండా జరిగే అవకాశముంటుంది.
తండ్రి, కుమారులైన రవి, శనులు ఒకేసారి ఉచ్ఛ, మిత్ర క్షేత్రాల్లో సంచరించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ ఈ రెండు ప్రధాన గ్రహాలు బలంగా ఉన్న పక్షంలో కష్టనష్టాల నుంచి బయటపడడం, మనసులోని కోరికల్లో కొన్నయినా నెరవేరడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభవార్తలు వినడం వంటివి తప్పకుండా జరిగే అవకాశముంటుంది. ఈ రెండు గ్రహల బలం వల్ల మే 15వ తేదీ వరకు కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు శని దోషం నుంచి, ఇతర కష్టనష్టాల నుంచి బయటపడే అవకాశముంటుంది.
- కర్కాటకం: ప్రస్తుతం అష్టమ శని దోషం కారణంగా పనులు పూర్తి కాక, ప్రమోషన్లు రాక, రావలసిన డబ్బు చేతికి అందక, జరగాల్సిన శుభకార్యాలు జరగక ఇబ్బందులు పడుతున్న ఈ రాశివారికి ఇక నుంచి అనేక వ్యవహారాలు చక్కబడడం ప్రారంభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, హోదాలు పెరగడానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రతిష్టంభన తొలగిపోయి, పురోగతి బాట పడతాయి. పిల్లలకు సంబంధించి శుభకార్యాలు జరిగే అవకాశముంది. ఆదాయానికి లోటుండదు.
- సింహం: ఈ రాశికి సప్తమంలో సంచారం చేస్తున్న శని వల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు, విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. అనేక పనులు పెండింగులో పడుతుంటాయి. శుభ కార్యాలు వాయిదా పడతాయి. రావలసిన సొమ్ము చేతికి అందదు. ఈ పరిస్థితుల నుంచి ఇక క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ చకచకా పూర్తవుతాయి. పదోన్నతులకు, జీత భత్యాల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా శుభ కార్యాలు జరుగుతాయి.
- వృశ్చికం: అర్ధాష్టమ శని కారణంగా ఈ రాశివారికి కుటుంబపరంగా సమస్యలు పెరగడం, సుఖ సంతోషాలు తగ్గడం జరుగుతుంది. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. శ్రమ, తిప్పట కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. అయితే, ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయి, ప్రతి పనీ వేగంగా పూర్తవుతుంది. కొత్త కార్య క్రమాలు చేపట్టడం, తద్వారా ఆర్థికంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల పరి స్థితులు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. కుటుంబం వృద్ధి చెందుతుంది.
- మకరం: శని, రవి గ్రహాల అనుకూలతల వల్ల ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో వేగంగా మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- మీనం: ఈ రాశివారికి శని, రవి గ్రహాల బలం వల్ల ఏలిన్నాటి దోషం చాలావరకు తగ్గిపోతుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. శత్రువులు, పోటీదార్లు నిష్క్రమిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా చక్కబడు తుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఏ వ్యవహారమైనా, ఏ ప్రయత్నమైనా వెను వెంటనే నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవ కార్యాలు పెరుగుతాయి.