Horoscope Today: ఈ రాశివారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరి ఇందులో మీ రాశి ఏంటి.?

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగత జీవి తంలో ఒకటి రెండు సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్య వ్యవహారాలు తేలికగా పూర్తవు తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

Horoscope Today: ఈ రాశివారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరి ఇందులో మీ రాశి ఏంటి.?
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Apr 15, 2024 | 11:27 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక వ్యవహారాల విషయంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయకపోవడం గానీ మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఉద్యోగ ప్రయ త్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యానికేమీ ఇబ్బంది ఉండదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం పొందుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఉన్న వారికి రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది.

మిథునం (మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు సహాయం చేయగల పరిస్థితిలో ఉంటారు. అద నపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవ హరించడం మంచిది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయ్యే అవకాశముంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి అవకాశాలు అందివస్తాయి. కొత్త వ్యాపా రాలు ప్రారంభించే అవకాశముంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థిక లావాదేవీలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు ఆశించిన ఫలితాలనివ్వకపోవచ్చు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశముంది. కుటుంబ సమస్యల విషయంలో ఇబ్బందుల్ని అధిగమిస్తారు. ఉద్యోగం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవు తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా ఒడిదుడుకుంటాయి. ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. అధికా రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు చక్కబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. పిల్లలకు విషయంలో ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. పుణ్య కార్యాల్లో ఎక్కువగా నిమగ్నం అవుతారు. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగత జీవి తంలో ఒకటి రెండు సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్య వ్యవహారాలు తేలికగా పూర్తవు తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరు గుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో స్నేహితులు సహాయంగా నిలుస్తారు. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా ఉత్సాహంగా, అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం మరింత పెరు గుతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఊపందుకుం టాయి. వ్యాపార విస్తరణకు అవకాశముంది. ఆదాయానికి లోటు లేనప్పటికీ ఖర్చుల్ని తగ్గించుకో వాల్సిన అవసరముంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ వ్యవహారాలు బాగా మెరుగ్గా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అదనపు బాధ్యతలతో కొద్దిగా ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుం డదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. దూరపు బంధువులతో పెళ్లి సంబం ధం ఖాయమవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఇతరుల బాధ్యతలను పంచుకో వడం జరుగుతుంది. మీ నుంచి ఇతరులు సహాయ సహకారాలు పొందుతారు. ఉద్యోగంలో అధి కారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. వృత్తి జీవితంలో డిమాండు బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన శుభవార్తలు అందు తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితం లాభసాటిగా ముందుకు సాగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. పోటీదార్ల బెడద చాలావరకు తగ్గుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవు తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలని స్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎవరికీ ఆర్థిక సంబంధమైన హామీలు ఉండకపోవడం శ్రేయస్కరం.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!