AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiac Signs: ఈ రాశులకు అదృష్ట దేవత ఆశీస్సులు..! మరో నెల రోజులు పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష శాస్త్రం ప్రకారం, తొమ్మిదవ స్థానాధిపతి బలంగా ఉంటే అదృష్టం, విజయాలు, సంపద ఖాయం. జాతకంలో ఎన్ని దోషాలున్నా ఇవి కొట్టుకుపోతాయి. ప్రస్తుతం, మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారికి అదృష్ట దేవత కరుణించి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాభాలు, వాహన యోగాలు కలుగుతాయి. రాజయోగాలతో వారి జీవితం నల్లేరుపై బండిలా సాగిపోతుంది.

Lucky Zodiac Signs: ఈ రాశులకు అదృష్ట దేవత ఆశీస్సులు..! మరో నెల రోజులు పట్టిందల్లా బంగారమే..
Lucky Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 08, 2025 | 2:13 PM

Share

జ్యోతిష శాస్త్రం ప్రకారం తొమ్మిదవ స్థానాధిపతే భాగ్య స్థానాధిపతి, అదృష్ట దేవత. జాతక చక్రంలో ఈ స్థానాధిపతి బలంగా ఉంటే ఇక ఆ జాతకుడికి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. జాతకంలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని లోపాలున్నా కొట్టుకుపోతాయి.తొమ్మిదవ స్థానాధి పతి బలంగా ఉంటే అటువంటి జాతకుడు రాజుగానీ, రాజ సమానుడుగానీ అవుతాడని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అదృష్టం బాగుండాలంటే 9వ స్థానాధిపతి బాగుండాలి. అటువంటి వారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారిని మరో నెల రోజుల పాటు అదృష్ట దేవత అనేక విధాలుగా కరుణించబోతోంది.

  1. మేషం: ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నందు వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోవడంతో పాటు, ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. లక్ష్మీదేవి వీరిని బాగా కరుణిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. జీవనశైలి మారిపోతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
  2. వృషభం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వ్యక్తిగత జీవితం బాగా పురోగతి చెందుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలకు దశ తిరుగుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్యస్థానాధిపతి అయిన గురువు ప్రస్తుతం ఇదే రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల రాజయోగాలు పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది.
  4. సింహం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో సొంత రాశి అయిన వృశ్చికంలో సంచారం చేస్తున్నందువల్ల గృహ, వాహన యోగాలు తప్పకుండా పట్టడం జరుగు తుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి.
  5. తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధ గ్రహం ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి మరో రెండు నెలల పాటు ఆదాయం వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇది వీరికి ఊహించని అదృష్టాలను కలుగజేస్తుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక లావా దేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ధన వర్షం కురిపిస్తాయి.
  6. మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం లాభ స్థానంలో సంచారం చేస్తున్నం దువల్ల మరో రెండు నెలల పాటు వీరి ఆర్థిక జీవితం ఉచ్ఛ స్థితిలో కొనసాగుతుంది. ఆదాయ వృద్ధితో పాటు అధికార యోగం కూడా కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా మటు మాయం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు అంచనాలకు మించి ఆదాయాన్నిచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.