- Telugu News Photo Gallery Spiritual photos Rahu in Shatabhisha: 6 Zodiac signs to get sudden wealth and prosperity by 2026
Money Astrology: రాహు బలంతో ఈ రాశులకు మహా యోగాలు! ఆకస్మిక ఆదాయానికి ఛాన్స్..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు ఒక వక్ర గ్రహం, పాప గ్రహం, విషనాగు. అయితే, జాతకంలో గానీ, గ్రహ చారంలో గానీ రాహువు అనుకూలంగా ఉంటే ఆ జాతకుల జీవితాలు అకస్మాత్తుగా ఉచ్ఛ స్థితికి చేరిపోయే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా ఆదాయం, సంపదలు పెరగడం, ఆస్తిపాస్తులు లభించడం, సొంత ఇల్లు అమరడం, విదేశాలకు వెళ్లి స్థిరపడడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ నెల(నవంబర్) 20 నుంచి తన సొంత నక్షత్రమైన శతభిషంలోకి ప్రవేశిస్తున్న రాహువు కొన్ని రాశుల వారి తలరాతను అనూహ్యంగా మార్చేసే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి 2026 ఫిబ్రవరి వరకూ ఇటువంటి అనుభవాలు కలగబోతున్నాయి.
Updated on: Nov 08, 2025 | 1:51 PM

మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రాహువు శతభిష నక్షత్రంలో సంచారం ప్రారంభించిన నాటి నుంచి దాదాపు వంద రోజుల వరకు ఈ రాశివారికి జీవితం వైభవంగా సాగిపోయే అవకాశం ఉంది. ఒక సంస్థలో అత్యున్నత పదవిని పొందే సూచనలున్నాయి. వ్యాపారాలు లేదా స్టార్టప్ లు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే తక్కువ కాలంలో, తక్కువ శ్రమతో కోటీశ్వరులు కావడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న రాహువు బాగా బలవంతుడవుతున్నందువల్ల ఉద్యోగ జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.

సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ఈ రాశివారిని అపర కుబేరులు చేసే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం సంపన్నులు కావడం జరుగుతుంది. ఈ వంద రోజుల కాలంలో రాజయోగాలు, రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. విదేశీ ఉద్యోగాలు చేసుకుంటున్నవారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న రాహువుకు విశేష బలం కలగడం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం పెరగడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయ. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న రాహువుకు బలం పెరగడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విదేశీ ఆఫర్లు అందుతాయి.

కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువుకు బలం పెరగడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఊహించని రాజయోగాలు కలుగుతాయి. అత్యంత ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి, గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఉన్నత కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.



