- Telugu News Photo Gallery Spiritual photos These are the remedies that Pisces people should do to reduce the effects of Saturn
ఈ రాశి వారికి ఏలినాటి శని రెండో దశ..ఈ ముప్పు తప్పదు!
అత్యంత శక్తివంతమైన గ్రహాలలో శని గ్రహం ఒకటి. శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి రాశి పరివర్తం చెందుతాడు. ఆ సమయంలో మూడు రాశులపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుపై ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ రాశుల వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Updated on: Nov 08, 2025 | 4:27 PM

మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది 2025లో రెండో దశలోకి చేరింది. ఈ సమయంలో శని గ్రహం మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు రెండో దశ ప్రారంభమైంది. అయితే మీన రాశి వారికి ప్రస్తుతం రెండో దశ కంటిన్యూ అవుతున్నది. అయితే ఈ దశ మీన రాశి వారిపై చాలా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు పండితులు. అందుకే ఈ సమయంలో రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట. లేకపోతే, ముప్పు తప్పదంట.

ఏలినాటి శని ప్రభావం అనేది మూడు దశల్లో ఉంటుంది. దీని ప్రభావం ఒక రాశి వారిపై ఏడున్నర సంవత్సరాలు దాని ప్రభావం చూపుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కుంభ రాశిలో చివరి దశలో ఉండగా, మీన రాశి వారికి మాత్రం రెండో దశ ప్రారంభమైంది. 2029 శని గ్రహం వృషభ రాశిలోకి ప్రారంభించినప్పుడు, మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ముగుస్తుందంట.

ఇక ఈ రెండో దశలో ఆర్థిక ఇబ్బందులు, చికాకులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వంటి అనేక ఇబ్బందులు తలెత్తుంటాయి. ఏ పని చేసినా అందులో విఫలం అవుతుంటారు. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కుంటారు కాబట్టి, మీన రాశి వారు ఏలినాటి శని రెండో దశలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలంట. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయి, ఆర్థికపరంగా, ముప్పు ఏర్పడే సమస్య ఉంది కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం రెండో దశ, మీపై అంతగా చెడు ప్రభావం చూపకూడదు అంటే, ప్రతి రోజూ శని వారం రోజున ఉదయం నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినపప్పు లేదా నల్లటి వస్త్రాలు దానం చేయాలంట. దీని వలన చాలా వరకు శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందంట.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



