Lucky Zodiac Signs: గ్రహాల అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం తలుపుతట్టడం పక్కా..!
Lucky Astrology 2025: ప్రస్తుతం మీన రాశిలో మూడు గ్రహాలు సంచారం చేస్తుండగా.. మార్చి నెలాఖరు నాటికి ఈ సంఖ్య ఆరుకు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 14 వరకు శుక్ర, బుధ, రాహువులు మీన రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత శుక్ర, బుధ, రాహువు, రవి గ్రహాలు ఇక్కడ సంచారం ప్రారంభిస్తాయి. మీన రాశిలో అత్యధిక గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనుంది.

Lucky Zodiac Signs
Luck and Fortune Astrology: ప్రస్తుతం మీన రాశిలో మూడు గ్రహాలు సంచారం చేస్తున్నాయి. మార్చి నెలాఖరు నాటికి ఈ సంఖ్య ఆరుకు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 14 వరకు శుక్ర, బుధ, రాహువులు మీన రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత శుక్ర, బుధ, రాహువు, రవి గ్రహాలు ఇక్కడ సంచారం ప్రారంభిస్తాయి. మీన రాశిలో అత్యధిక గ్రహాల సంచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశులకు అదృష్టం తలుపు తట్టనుంది. అనేక విధాలుగా శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశులకు లాభ స్థానంలో ఎక్కువ గ్రహాల సంచారం వల్ల తప్పకుండా అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. మరింత ఆదాయమిచ్చే ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ది చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు, ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో గ్రహాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల ప్రాధాన్యం, ప్రాభవం పెరగడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి అనేక సంస్థల నుంచి ఆహ్వానాలు, ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ పరంగానే కాక, వ్యక్తిగతంగా కూడా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రముఖులతో సాన్నిహిత్యం కలుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం కావడం వల్ల ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఊహించని స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అపార ధన లాభాలు కలుగుతాయి. విదేశీ ప్రయతాలన్నీ సఫలం అవుతాయి. పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి పెరుగుతాయి.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెంద డంతో పాటు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అనారో గ్యాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడి అభివృద్ధి బాట పడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో గ్రహాల సంఖ్య పెరుగుతున్నందువల్ల ఏ రంగంలోనివారికైనా వృద్ధి, పురోగతి తప్పకుండా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో అత్యధికంగా గ్రహాలు కలవడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులకు మీ వల్ల అనేక లాభాలు కలుగుతాయి.



