AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Yoga: గురు, శుక్రుల రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి రాజ యోగాలు..!

ప్రస్తుతం ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడు, గురువుల మధ్య రాశి పరివర్తన జరిగింది. దీని కారణంగా జాతక చక్రం లేదా గ్రహ సంచారం మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొన్ని రాశుల అధిపతులు దుస్థానాల్లో, అంటే 1, 6, 8, 12 రాశుల్లో ఉన్నప్పటికీ, నీచ స్థితిలో ఉన్నప్పటికీ బాగా లబ్ధి పొందడం జరుగుతుంది. గురు, శుక్రుల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి దోషాలు తొలగిపోయి రాజయోగాలు కలిగించడం జరుగుతుంది. ఇది మే మొదటి వారం వరకూ కొనసాగే అవకాశం ఉంది.

Raja Yoga: గురు, శుక్రుల రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి రాజ యోగాలు..!
Raj Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 04, 2025 | 7:12 PM

Share

Telugu Astrology: ప్రస్తుతం ఉచ్ఛ శుక్రుడు, గురువుల మధ్య రాశి పరివర్తన జరిగినందువల్ల జాతక చక్రం లేదా గ్రహ సంచారం మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొన్ని రాశుల అధిపతులు దుస్థానాల్లో, అంటే 1, 6, 8, 12 రాశుల్లో ఉన్నప్పటికీ, నీచ స్థితిలో ఉన్నప్పటికీ బాగా లబ్ధి పొందడం జరుగుతుంది. మేషం, మిథునం, తుల, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులకు ప్రస్తుతం రాశ్యధిపతులు దుస్థానాల్లోనూ, నీచ స్థితిలోనూ ఉండడం జరుగుతోంది. గురు, శుక్రుల ప్రభావం వల్ల ఈ దోషాలు తొలగిపోయి రాజయోగాలు కలిగించడం జరుగుతుంది. ఇది మే మొదటి వారం వరకూ కొనసాగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశినాథుడైన కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల బలహీనుడయ్యే అవకాశం ఉంటుంది. అయితే, శుక్ర, గురువులతో పాటు బుధుడు కూడా బలంగా ఉన్నందువల్ల వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి పోటీ ఉన్నా ప్రత్యర్థుల మీద వీరిదే పైచేయిగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడు దశమ స్థానమైన మీన రాశిలో నీచపడడం జరిగింది. అయితే, బుధుడితో ఉచ్ఛ శుక్రుడు కలిసినందువల్ల బుధుడు ఎక్కువగా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో సమర్థత వెలుగులోకి వస్తుంది. ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
  3. తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే, ఈ శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల, గురువుతో పరివర్తన చెందినందువల్ల అత్యంత శుభుడుగా మారడం జరిగింది. ఫలితంగా ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు కలుగుతాయి.
  4. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల అష్టకష్టాలు పడడం జరుగుతుంది. అయితే, ఈ రాశిని గురువు వీక్షిస్తున్నందువల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
  5. ధనుస్సు: రాశినాథుడు గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల పురోగతి స్తంభించిపోవడంతో పాటు, సమస్యలు, వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కు తారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
  6. మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. వైఫల్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. అయితే, ఈ గురువు ఉచ్ఛ శుక్రుడితో పరివర్తన చెందినందువల్ల ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన అభివృద్ధి, పురో గతి అనుభవానికి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

Follow Us
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?