YS Sharmila: “ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు…రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే..!”.. వైఎస్ షర్మిల సూటిప్రశ్న..

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైఎస్సార్ వర్సిటీగా మార్చడంపై రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కొత్తవి నిర్మించి పేర్లు పెట్టుకోవాలి గానీ.. ఉన్నవాటికి..

YS Sharmila: ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు...రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే..!.. వైఎస్ షర్మిల సూటిప్రశ్న..
Ys.sharmila
Follow us

|

Updated on: Sep 23, 2022 | 5:11 PM

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైఎస్సార్ వర్సిటీగా మార్చడంపై రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కొత్తవి నిర్మించి పేర్లు పెట్టుకోవాలి గానీ.. ఉన్నవాటికి పేర్లు మార్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వైఎస్సార్ పేరు పెట్టడంపై స్పందించారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే ఆ మహానుభావులను అవమానపరిచినట్లేనని వ్యాఖ్యానించారు. నాన్న (వైఎస్సార్) తనను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని చెప్పారు. అలాంటి పెద్ద మనుషులను అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేని పేర్కొన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు…రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే..! పరిస్థితి ఏంటని నిలదీశారు. అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించినట్లే కదా అని ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ కు ఖ్యాతి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఈ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని వివరించారు. అలాంటి మహావ్యక్తి చనిపోతే ఆ భాద తట్టుకోలేక 700 మంది చనిపోయారని, అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్సార్ కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని తేల్చి చెప్పారు.

కాగా.. విజయవాడలో ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఏపీ ప్రభుత్వం మార్చింది. ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నా తన పంతం నెగ్గించుకుంది. ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ సెప్టెంబర్ 21వ తేదీ బుధవారం శాసనసభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరన్న సీఎం జగన్.. ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ గౌరవని, ఎన్టీఆర్‌ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదని, చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్‌కు నచ్చదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి.. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించి, ప్రాణం విలువ తెలిసిన డాక్టర్‌ గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత వైఎస్.రాజశేఖర్ రెడ్డిది అని సీఎం జగన్ కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు ఆరోగ్య వర్సిటీకి పెట్టడమే సరైనదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ విషయంలో ఆయన మీద ఎలాంటి కల్మషం లేదని, ఎవరూ అడగకపోయినా ఆయన పేరు మీద జిల్లా పెట్టామని, టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..