Navaratri 2022: శరన్నవరాత్రులకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి.. 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.. ప్రత్యేక ఏర్పాట్లు..

దసరా నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై చిన్న చిన్న పనులు మినహా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కొండపై లైటింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోబోతున్నామని పేర్కొన్నారు.

Navaratri 2022: శరన్నవరాత్రులకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి.. 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.. ప్రత్యేక ఏర్పాట్లు..
Vijayawada Kanaka Durga Tem
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2022 | 4:45 PM

Navaratri 2022: శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి అంగరంగ వైభంగా ముస్తాబవుతోంది.  దాదాపు రెండేళ్ల తర్వాత దసరా ఉత్సవాలు ఎటువంటి ఆంక్షలు లేకుండా జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గాదేవిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు.. తాము దసరా పర్వదినం సందర్భంగా దుర్గాదేవిని దర్శించుకోవడానికి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. కో ఆర్డినేషన్ కమిటి మీటింగ్ లో అన్ని సూచనలు పరిగణంలోకి తీసుకొని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

దసరా నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై చిన్న చిన్న పనులు మినహా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కొండపై లైటింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. భక్తులకోసం 21 లక్షల ప్రసాదాలు సిద్దం చేస్తున్నామన్నారు. దసరా సందర్భంగా భక్తులకు ఈ ఏడాది అంతరాలయం దర్శనం లేదని పేర్కొన్నారు. ఉచిత దర్శనం తో పాటు, రూ.100, రూ. 300 క్యూ లైన్స్ తో పాటు VIP లకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని ఈవో భ్రమరాంబ చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. దర్శన సమయంలో ఎక్కడా ఆగకుండా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే.. ఈ ఏడాది నవరాత్రులు అన్నదానం నిర్వహించడంలేదు.. భక్తులకు భోజన ప్యాకెట్స్ అందజేస్తున్నామని చెప్పారు భ్రమరాంబ.

భక్తులకు రెస్ట్ షెడ్స్ , వాష్ రూమ్స్ అధికంగా ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో 300 షవర్స్ ఏర్పాటు చేస్తే.. ఈసారి 800 షవర్స్ ఏర్పాటు చేశాం. వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా 250 మంది శానిటేషన్ సిబ్బందితో శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని  చెప్పారు.

ఇవి కూడా చదవండి

దసరా పర్వదినం సందర్భంగా అమ్మవారి దర్శనం తెల్లవారుజాము 3 గం.ల నుండి రాత్రి 10.30 వరుకు ఉంటుందని పేర్కొన్నారు. తొలి రోజు అమ్మవారి స్నపనాభిషేకం అనంతరం ఉ.9 నుండి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఖడ్గమాల అర్చన అంతరాలయంలో కాకుండా 6వ అంతస్తులో నిర్వహించబోతున్నామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..