TDP Vs YSRCP: లీడర్ టు క్యాడర్.. రప్పా రప్పా! నెలరోజులుగా ఏపీలో పొలిటికల్ వార్!
సినిమా అండ్ పాలిటిక్స్. రెండూ విభిన్న ప్రపంచాలే. బట్.. ఈ రెండింట్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే జనాల్లో మాస్ ఇమేజ్‌ను తీసుకొచ్చే మోస్ట్ పవర్‌ఫుల్ సెంటర్లు అవి మాత్రమే. బట్.. రానురానూ సమాజంలో జరిగే సంఘటనలను, రాజకీయాలను మిక్స్ చేయడం మొదలైంది. పాలకులు ఊరుకుంటారా..!

సినిమా అండ్ పాలిటిక్స్. రెండూ విభిన్న ప్రపంచాలే. బట్.. ఈ రెండింట్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే జనాల్లో మాస్ ఇమేజ్‌ను తీసుకొచ్చే మోస్ట్ పవర్‌ఫుల్ సెంటర్లు అవి మాత్రమే. బట్.. రానురానూ సమాజంలో జరిగే సంఘటనలను, రాజకీయాలను మిక్స్ చేయడం మొదలైంది. పాలకులు ఊరుకుంటారా..! ట్రెండ్ ఫాలో అవడం మొదలుపెట్టారు. ఏం.. సినిమాల్లోని అంశాలను రాజకీయానికి వాడుకోకూడదా అనుకున్నారు, వాడుకుంటున్నారు. మెయిన్‌గా… సినిమా డైలాగులను. ఆ వాడుకోవడం ఇప్పుడు ఓ రేంజ్‌కి చేరింది. ఈ రప్పా రప్పా రాజకీయం మొదలయ్యాక సినిమా అండ్ పాలిటిక్స్ వేర్వేరు ప్రపంచాలు కాదేమో అనిపిస్తోంది. ఏదో ఒక బర్నింగ్ టాపిక్ కావాలి. రచ్చబండ దగ్గర పిచ్చాపాటిగా మాట్లాడుకోడానికైనా, రాజకీయ వేదికలపై ప్రత్యర్ధులను టార్గెట్ చేయడానికైనా. ఆ ఒక్క టాపిక్.. ట్రెండ్ సెట్ చేయొచ్చు, పొలిటికల్ ట్రెండ్‌ను మార్చొచ్చు, లేదా… ‘ఏంట్రా ఈ గోల’ అని కూడా అనిపించొచ్చు మరీ విసుగొస్తే. రప్పా రప్పా డైలాగ్‌ను జనం ఎలా తీసుకుంటున్నారో పరీక్షించే కిట్ అయితే లేదు గానీ.. రాజకీయ నాయకులు మాత్రం బాగా ఉపయోగించుకుంటున్నారు పొలిటికల్ మైలేజ్ కోసం. తను పెట్టిన ఫ్లెక్సీ ఇంత వైరల్ అవుతుందని బహుశా కార్యకర్త రవితేజ కూడా ఊహించి ఉండడు. మళ్లీ అదో కాన్‌ఫ్లిక్ట్. ఆ ఫ్లెక్సీ పెట్టింది ఒకప్పటి టీడీపీ కార్యకర్తే అని వైసీపీ నుంచి కౌంటర్ వచ్చింది. సరే.. ఏ పార్టీ కార్యకర్త అనేది అనవసరం. పెట్టింది వైసీపీకి మద్దతుగా, టీడీపీకి...




