AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాజకీయాల నుంచి వైదొలగడానికి సిద్ధమేనా..? దేవినేనికి ఎమ్మెల్యే వసంత స్ట్రాంగ్ కౌంటర్..

మైలవరంలో మైనింగ్ వివాదంతో కలకలం రేపుతోంది. టీడీపీ వర్సెస్‌ వైసీపీ మైనింగ్‌ ఆరోపణలు మంటలు రేపుతున్నాయి. దేవినేని విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌.

Andhra Pradesh: రాజకీయాల నుంచి వైదొలగడానికి సిద్ధమేనా..? దేవినేనికి ఎమ్మెల్యే వసంత స్ట్రాంగ్ కౌంటర్..
Mylavaram Politics
Shaik Madar Saheb
|

Updated on: Apr 09, 2023 | 12:09 PM

Share

మైలవరంలో మైనింగ్ వివాదం మంటలు రేపుతోంది. వైసీపీ, టీడీపీల మధ్య సవాళ్ళు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమ అక్రమ మైనింగ్‌ ఆరోపణలు గుప్పించారు. ఇదేమని ప్రశ్నిస్తే.. రాజీనామా డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. దేవినేని వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌.. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజానామాకు సిద్ధమని.. ఆయన రాజకీయాలనుంచి వైదొలగడానికి సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు. అంతేకాదు.. టీవీ9 అగ్రిమెంటు రెడీచేయాలని వసంతకృష్ణప్రసాద్‌ కోరారు. తనపై ఆరోపణలు నిరూపించాలంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌… దేవినేనికి ఛాలెంజ్‌ చేశారు.

ఆరోపణలు నిరూపించాలనీ, లేదంటే దేవినేని ఉమ రాజకీయాల నుంచి వైదొలగాలనీ… ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సవాల్‌ విసిరారు. తన పుట్టిన రోజున టీవీ9 సాక్షిగా సవాల్‌ చేస్తున్నానన్న ఎమ్మెల్యే.. టీవీ 9 స్పీకర్‌ ఫార్మేట్లో డాక్యుమెంట్‌ రెడీ చేయాలని కోరారు.

అధికారంలో ఉన్నప్పుడు అతను దోచుకోవడం.. ప్రతిపక్షంలో ఉంటే ఎదుటివారితో రాజీపడి డబ్బులు తీసుకోవడం అతని నైజం అంటూ వసంత కృష్ణప్రసాద్‌.. దేవినేని ఉమపై ఆరోపణలు గుప్పించారు. దేవినేని డబ్బులు తీసుకుంటూ పిత్తిరి ముత్తైదువలా కూర్చున్న విషయం టీడీపీ వాళ్ళకే తెలుసన్నారు ఎమ్మెల్యే.

ఇవి కూడా చదవండి

అక్రమ మైనింగ్‌, అక్రమ ఇసుక టోల్‌గేట్‌ల దందాకి దేవినేని ఉమాయే ఆద్యుడని ఆరోపణలు గుప్పించారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌. ఎవరిమీదైనా బురదజల్లగల సత్తా దేవినేనిదన్నారు. దేవినేని ఆరోపణలు గురవింద సామెతంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..