Perni Nani: అప్పుడు చిరంజీవి ఏం చేశారు.. గిల్లితే గిల్లించుకోవాలి.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
Perni Nani counter to Megastar Chiranjeevi: వైసీపీ వర్సెస్ జనసేన.. బ్రో సినిమా రిలీజ్‌తో మొదలైన వివాదం.. కంటిన్యూ అవుతూనే ఉంది. బ్రో సినిమాలో పృథ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ అగ్గి రాజేసింది. అచ్చం మంత్రి అంబటి రాంబాబును పోలి ఉండటంతో రచ్చమొదలై రెమ్యునరేషన్ వరకు వెళ్లింది. అంతటితో ఆగకుండా.. ఈడీ వరకు కూడా ఈ వ్యవహారం చేరింది. ఈ వివాదం సద్దుమణగకముందే.. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత ఆజ్యం పోశాయి.

విజయవాడ, ఆగస్టు 08: వైసీపీ వర్సెస్ జనసేన.. బ్రో సినిమా రిలీజ్‌తో మొదలైన వివాదం.. కంటిన్యూ అవుతూనే ఉంది. బ్రో సినిమాలో పృథ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ అగ్గి రాజేసింది. అచ్చం మంత్రి అంబటి రాంబాబును పోలి ఉండటంతో రచ్చమొదలై రెమ్యునరేషన్ వరకు వెళ్లింది. అంతటితో ఆగకుండా.. ఈడీ వరకు కూడా ఈ వ్యవహారం చేరింది. ఈ వివాదం సద్దుమణగకముందే.. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత ఆజ్యం పోశాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని చిరంజీవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి జరిగినప్పుడు ఎదురుదాడి జరుగుతుందని పేర్ని నాని అన్నారు. సినిమా హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎవరూ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. అయితే, గిల్లితే గిల్లించుకోవాలని పరోక్షంగా పవన్ గురించి కామెంట్ చేశారు. ఒరిజినల్ సినిమాలో లేకపోయినా కావాలనే దురుద్దేశంతో ఒక నాయకుడి పాత్రను బ్రో సినిమాలో పెట్టారని పేర్ని నాని విమర్శించారు.
మంగళవారం మాట్లాడిన పేర్ని నాని.. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా కృషి చేయాలన్న సినీ నటుడు చిరంజీవి సూచనపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అభిమాన నటుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా అప్పటి ప్రభుత్వం వ్యవహరించినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఏం చేశారంటూ నాని ప్రశ్నించారు.
పుంగనూరులో పోలీసుల దాడి వ్యవహారంలో ప్రధాన ముద్దాయి, కుట్రదారు టీడీపీ అధినేత చంద్రబాబు అని YCP నేత పేర్ని నాని ఆరోపించారు. ముసలి వయస్సులో ఇంత అరాచకం అవసరమా అగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులపై దాడి చేయడానికి కర్రలు, రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ నాని ప్రశ్నించారు. పోలీసుల రక్షణ లేనిదే ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేని చంద్రబాబు, లోకేష్.. పోలీసులను నిందిస్తారని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత చెడుకైనా ఒడిగడతారని పేర్ని నాని ఆరోపించారు.




కాగా చిరంజీవి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధిపై దృష్టిసారించకుండా.. టాలీవుడ్ ఇండస్ట్రీపై పడుతున్నారంటూ వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ లో మాట్లాడారు. ప్రత్యేక హోదా, ఉద్యోగాలు, ఉపాధి, రోడ్ల గురించి మాట్లాడాలంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై ఏపీ అధికార పార్టీ వైసీపీ మండిపడుతోంది. చిరంజీవి ఇప్పటివరకు ఏం చేశారంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..