AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Body Elections: ఆ ఇద్దరూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు..

ysrcp mla slammed tdp leaders: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

AP Local Body Elections: ఆ ఇద్దరూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు..
Ambati
Shiva Prajapati
|

Updated on: Feb 17, 2021 | 4:39 PM

Share

AP Panchayat Election: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై చంద్రబాబు, పవన్‌లు దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. అధికారం కోసం ఈ ఇద్దరు నేతలు అర్రులు చాస్తున్నారంటూ విమర్శించారు. బుధవారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏకగ్రీవాలు అనర్థమని చెప్పటం బాధాకరం అన్ నారు. పరస్పర అంగీకారంతో ఏకగ్రీవం అయితే తప్పు ఎలా అవుతుందంటూ విపక్ష పార్టీల నేతలను అంబటి రాంబాబు ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై అందరూ సంతోషించాల్సిన అంశం అని అన్నారు. ఏకగీవ్రాలపై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితం అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఈ ధోరణి శోచనీయం అని అంబటి వ్యాఖ్యానించారు.

Also read:

నటుడు సందీప్ నహర్ సూసైడ్ కేసులో భార్య కాంచన్ శర్మపై ఎఫ్ ఐ ఆర్, ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

మూసీ పరివాహక రైతుల సంబరాలు.. కోటి వృక్షార్చన ఎందుకో చెప్పేసిన మంత్రి జగదీష్‌రెడ్డి