మూసీ పరివాహక రైతుల సంబరాలు.. కోటి వృక్షార్చన ఎందుకో చెప్పేసిన మంత్రి జగదీష్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మూసీనది పరివాహక ప్రాంతంలో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి..

  • Updated On - 4:20 pm, Wed, 17 February 21
మూసీ పరివాహక రైతుల సంబరాలు.. కోటి వృక్షార్చన ఎందుకో చెప్పేసిన మంత్రి జగదీష్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మూసీనది పరివాహక ప్రాంతంలో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి హాజరై రైతులతో కలిసి మొక్కలు నాటారు. కాసరబాద్ లోని పంట పోలాల మధ్యన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి రైతులతో ఆనందం పంచుకున్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

అంతకు మంతు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా మహిళలు ఆటపాటలతో మంత్రి జగదీష్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చేది మొక్కలు పెంపకంపైనేనని మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. అందుకే ఆయన జన్మదిన వేడుకలసందర్భంగా కోటి వృక్షార్చన కు శ్రీకారం చుట్టామన్నారు.

మానవ సమాజానికి పర్యావరణం పెను సవాల్ గా మారింది. ఆ సవాల్ ను అధిగమించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని మంత్రి జగదీష్‌రెడ్డి వివరించారు. 67 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాదు అనుకున్న రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి అంటే ఏమిటో నిరూపించారు. యావత్ భారతదేశంలోనే తెలంగాణా ను నెంబర్ వన్ గా నిలిపారని మంత్రి కొనియాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏండ్లుగా మూసి ఆయకట్టు కు రెండో పంటకు నిరందలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను అమలు పరిచాకే ఇక్కడి రైతులకు సమృద్ధిగా సాగు నీరు అందుతుందని అన్నారు. అందుకు కృతజ్ఞతతోటే రైతులు సంబురాలు చేసుకుంటున్నారని చెప్పారు.

 

Read more:

ప్రగతి భవన్‌లో మొక్కలు నాటిన కేటీఆర్‌.. కోటి వృక్షార్చనలో పాల్గొన్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి