ముగిసిన ఆంధ్రప్రదేశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం..!

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2వేల639 సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరగింది

ముగిసిన ఆంధ్రప్రదేశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం..!
AP Panchayat Elections
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 17, 2021 | 4:34 PM

AP Local Elections Phase 3 : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2వేల639 సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరిగింది. ఇది మరికాసేపట్లో నేతల భవితవ్యం తేలనుంది. మూడో విడతలో జరుగుతున్న స్థానాల్లో 7వేల757 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 160 మండలాల్లోని 26,851 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ మొదలై మధ్యాహ్నాం 3.30 గంటలకు ముగిసింది. ఇక మూడో విడతలో 3,321 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అందులో 579 సర్పంచ్‌ పదవులకు ఎన్నికగ్రీవమయ్యాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లో అధికార వైఎస్సార్‌సీపీ హవా కొనసాగించింది.

అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు తలెత్తాయి. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఏజన్సీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజన్సీలో అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రత. అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు మధ్యలో ప్రజలు… టెన్షన్‌తోనే పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు.

ప్రస్తుతానికి పోలింగ్‌ ముగిసినా… లెక్కింపు పూర్తై విజేతలను ప్రకటించి, ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఫీల్డ్‌ ఆఫీసర్స్‌కు మెసేజ్ పంపించారు. మరికొన్ని రోజులు అలర్ట్‌గా ఉండాలని నిర్ణయించారు.

వివిధ ప్రాంతాల్లో అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. కాగా, ఇప్పటివరకు రెండు విడతల్లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే…,

మొత్తం వెలువడిన ఫలితాలు – 6,577 వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు – 5,279 టీడీపీ మద్దతుదారులు – 1,045 బీజేపీ మద్దతుదారులు – 44 జనసేన మద్దతుదారులు – 57 ఇతరులు – 152