Andhra Pradesh: రూ.2 వేల నోట్ల రద్దుని స్వాగతిస్తున్నామన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి
రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో చలామణీలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిన ఆర్బీఐ వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో చలామణీలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిన ఆర్బీఐ వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ఆదేశాలు కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.2వేల నోట్లు కలిగి ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో కరెన్సీ మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి స్పందించారు.
నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని తెలిపారు. రూ.2 వేల నోట్లు రద్దు ద్వారా బ్లాక్ మనీని అరికట్టే క్రమంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2016 నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసిన తర్వాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..