SBI Recruitment 2023: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే బ్యాంక్ జాబ్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రెగ్యులర్ ప్రాతిపదికన 47 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రెగ్యులర్ ప్రాతిపదికన 47 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు సంబందిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 32 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 5, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరికి చెందిన వారు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికై వారికి నెలకు రూ.63,840ల నుంచి రూ.78,230ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్)- 1
- చీఫ్ మేనేజర్ (పీఎంవో లీడ్)- 2
- చీఫ్ మేనేజర్ (టెక్ ఆర్కిటెక్ట్)- 3
- ప్రాజెక్ట్ మేనేజర్- 6
- మేనేజర్ (టెక్ ఆర్కిటెక్ట్)- 3
- మేనేజర్ (డేటా ఆర్కిటెక్ట్)- 3
- మేనేజర్ (డీఎస్‌వో ఇంజినీర్)- 4
- మేనేజర్ (అబ్జర్వబిలిటీ అండ్ మానిటరింగ్ స్పెషలిస్ట్)- 3
- మేనేజర్ (ఇన్‌ఫ్రా/ క్లౌడ్ స్పెషలిస్ట్)- 3
- మేనేజర్ (ఇంటిగ్రేషన్ లీడ్)- 1
- మేనేజర్ (ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్)- 4
- మేనేజర్ (ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్)- 4
- మేనేజర్ (ఎస్‌ఐటీ టెస్ట్ లీడ్)- 2
- మేనేజర్ (పెర్ఫామెన్స్ టెస్ట్ లీడ్)- 2
- మేనేజర్ (ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్)- 1
- డిప్యూటీ మేనేజర్ (ఆటోమేషన్ టెస్ట్ లీడ్)- 4
- డిప్యూటీ మేనేజర్ (టెస్టింగ్ అనలిస్ట్)- 4
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.