Andhra Pradesh: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ సంచలన నిర్ణయం.. ఆ 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల మార్పు

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు (డిసెంబర్ 11) ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్య నారాయణ 11 నియోజకవర్గాల కొత్త ఇన్‌ఛార్జ్‌ల పేర్లను మీడియాకు తెలిపారు.

Andhra Pradesh: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ సంచలన నిర్ణయం.. ఆ 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల మార్పు
CM Jagan
Follow us

|

Updated on: Dec 11, 2023 | 10:01 PM

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 11) ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్య నారాయణ 11 నియోజకవర్గాల కొత్త ఇన్‌ఛార్జ్‌ల పేర్లను ప్రకటించారు కాగా  175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న వైసీపీ.. 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జులను మార్చింది. ఈ మార్పు మంగళగిరి నియోజకవర్గం నుంచే మొదలైనట్టు కనిపిస్తోంది. దాదాపుగా ఈ మార్పును ఊహించేనేమో.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాకపోతే, పార్టీకి కూడా రాజీనామా చేయడమే సెన్సేషన్ సృష్టించింది. మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలను ఆప్కో ఛైర్మన్‌ గంజి చిరంజీవికి అప్పగించింది.

మొత్తం 11 నియోజకవర్గాల వైసీపీ ఇన్‌చార్జ్‌లను మార్చింది అధిష్టానం. ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాలసాని కిరణ్‌కుమార్‌, కొండెపి-ఆదిమూలపు సురేష్‌, వేమూరు-వరికూటి అశోక్‌బాబు, తాడికొండ-మేకతోటి సుచరిత, సంతనూతలపాడు-మేరుగు నాగార్జున, చిలకలూరిపేట-మల్లెల రాజేష్‌నాయుడు, గుంటూరు వెస్ట్-విడదల రజిని, అద్దంకి-పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి-గంజి చిరంజీవి, రేపల్లె-ఈవూరు గణేష్‌, గాజువాక నియోజకవర్గ బాధ్యతలను వరికూటి రామచంద్రరావుకు అప్పగించారు. ఈసారి బీసీ సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు సీఎం జగన్. టికెట్లు ఇచ్చే విషయంలో కొన్ని అగ్రకులాలకు కొంత ప్రాధాన్యత తగ్గించి, బీసీలకు టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారు. బహుశా, ఈ విషయం గమనించే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి గానీ, గాజువాక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తిప్పల దేవన్‌ రెడ్డి గానీ పార్టీకి కొంత నెగటివ్‌గా స్పందించారని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా గాజువాక టికెట్‌ ఆశించిన తిప్పల దేవన్‌ రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

11 నియోజకవర్గాల కొత్త ఇన్‌ఛార్జ్‌లు వీరే..

  • ప్రత్తిపాడు-బాలసాని కిరణ్‌కుమార్‌
  • కొండెపి-ఆదిమూలపు సురేష్‌
  • వేమూరు-వరికూటి అశోక్‌బాబు
  • తాడికొండ-మేకతోటి సుచరిత
  • సంతనూతలపాడు-మేరుగు నాగార్జున
  • చిలకలూరిపేట-మల్లెల రాజేష్‌నాయుడు
  • గుంటూరు వెస్ట్-విడదల రజిని
  • అద్దంకి-పాణెం హనిమిరెడ్డి
  • మంగళగిరి-గంజి చిరంజీవి
  • రేపల్లె-ఈవూరు గణేష్‌
  • గాజువాక-వరికూటి రామచంద్రరావు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..