AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. 30 పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రభత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్‌ జీవిత సాఫల్య, వైఎస్సార్‌ సాఫల్య–2022’ పురస్కారాలను..

Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. 30 పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రభుత్వం..
YSR Lifetime achievement awards
Amarnadh Daneti
|

Updated on: Nov 01, 2022 | 9:18 AM

Share

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రభత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్‌ జీవిత సాఫల్య, వైఎస్సార్‌ సాఫల్య–2022’ పురస్కారాలను ప్రదానం చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుసగా రెండో ఏడాది ఈ పురస్కారాలను ప్రభుత్వం అందిచనుంది. మంగళవారం ఉదయం విజయవాడలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ హాజరవుతారు. వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేషకృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు కలిపి 30 పురస్కారాలను అందజేయనున్నారు. వీటిలో 20 వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు కాగా.. 10 వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘వైఎస్సార్‌’ అవార్డులను గత ఏడాది నుంచి అందిస్తూ వస్తోంది.

వ్యవసాయంలో 5, కళలు–సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యరంగంలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషిచేసి, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్‌ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించనున్నారు.

వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకోనున్న వారి వివరాలు

వ్యవసాయ రంగం ( వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలు)

  • ఆదివాసీ కేష్యూనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ– సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా
  • కుశలవ కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ – ఎ.గోపాలకృష్ణ; బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా
  • అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ – జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా
  • అమృత ఫల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ –కె.ఎల్‌.ఎన్‌. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా
  • కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా

కళలు–సంస్కృతి విభాగం (వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలు)

  • కళాతపస్వి, నిండు తెలుగుదనం ఉట్టిపడే తెలుగువాడు కె.విశ్వనాథ్‌…
  • బడుగు బలహీన వర్గాల కోసం, గ్రామం కోసం, పేదల కోసం… నిరంతరం తపించి జీవితాన్ని అర్పించిన ఆర్‌. నారాయణమూర్తి
  • సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ…
  • మన కలంకారీ… పెడన నేతన్న పిచుక శ్రీనివాస్‌
  • దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్‌ కట్లరీ… అంటే వంటింట్లో వాడే చెక్క వస్తువుల తయారీలో శ్రీమతి షేక్‌ గౌసియా బేగం

సాహిత్య రంగం (వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు)

  • విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
  • ఎమెస్కో ప్రచురణాలయానికి…
  • రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ

మహిళా సాధికారత–రక్షణ విభాగం (వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు)

  • ప్రజ్వలా ఫౌండేషన్‌– సునీతా కృష్ణన్‌…
  • ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్‌ సెంటర్‌…
  • దిశ–పోలీసింగ్‌

విద్యా రంగం నుంచి…

  • మదనపల్లి – రిషీ వేలీ విద్యా సంస్థకు
  • కావలి– జవహర్‌ భారతి విద్యా సంస్థకు.. ఈ రెండు విద్యా సంస్థలకు వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు.
  • మనస్తత్వ శాస్త్రాల నిపుణుడు బి.వి.పట్టాభిరాంకు… లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌
  • బ్యాంకింగ్‌ రంగంలో వేల మంది ప్రవేశానికి దారి చూపిన దార్శనికుడు, మంచి మాస్టారు నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డికి వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు
  • మీడియా అవార్డులు- సీనియర్‌ పాత్రికేయులు 1) భండారు శ్రీనివాసరావు 2) సతీశ్‌ చందర్‌ 3) మంగు రాజగోపాల్‌ 4) ఎంఈవీ ప్రసాదరెడ్డి – ఈ నలుగురికీ వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించారు.

వైద్య రంగంలో

  • డాక్టర్‌ బి. నాగేశ్వరరెడ్డి, ఏఐజీకి… ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ
  • డాక్టర్‌ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్‌… (హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌)
  • భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు… (కోవాక్సిన్‌)
  • అపోలో హాస్పటల్స్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి…
  • ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ తరఫున గుళ్ళపల్లి నాగేశ్వరరావు

ఈ అయిదు సంస్థలు/వ్యక్తులకు వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

పారిశ్రామిక రంగంలో..

అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గ్రంధి మల్లికార్జునరావుగారికి… వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Follow Us