Watch Video: ‘పులివెందులకు వైఎస్ కుటుంబం బలం.. వైఎస్ కుటుంబానికి పులివెందుల బలం’.. ప్రచారంలో వైఎస్ భారతి..

పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ భారతి. తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి. ఈమెతోపాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‎లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Watch Video: 'పులివెందులకు వైఎస్ కుటుంబం బలం.. వైఎస్ కుటుంబానికి పులివెందుల బలం'.. ప్రచారంలో వైఎస్ భారతి..
Ys Bharathi
Follow us

|

Updated on: Apr 28, 2024 | 6:22 PM

పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ భారతి. తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి. ఈమెతోపాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‎లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలని సూచించారు. ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ భారతి, సమతలను గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి అర్జీలు సమర్పించుకున్నారు.

ప్రచారం వీడియో..

వైఎస్ భారతి కూడా ఓపిగ్గా అక్కడున్న స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రేమగా మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇలా సీఎం జగన్ ఒకవైపు రాష్ట్ర వ్యాప్త సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. భర్తకు తోడుగా సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎన్నికల ప్రచారానికి భారతి పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాల వల్ల ఇక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రచారానికి విశేష స్పందన వస్తుందని వైఎస్ భారతి అన్నారు. ఈసారి లక్షపైన మెజార్టీతో సీఎం జగన్‎ను గెలిపిస్తామని చెప్పారు. అలాగే పులివెందులకు వైఎస్ కుటుంబం బలం.. వైఎస్ కుటుంబానికి పులివెందుల బలం అంటూ నినాదాన్ని వినిపించారు.

ఇవి కూడా చదవండి

ఫేస్ టు ఫేస్ వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..