Paritala Sriram: పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్.. వారంతా జాగ్రత్త పడాల్సిందిగా సూచన
దేశవ్యాప్తంగా కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఏపీలో కూడా వైరస్ వ్యాప్తి చాలా ప్రమాదకరంగా ఉంది.
AP Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఏపీలో కూడా వైరస్ వ్యాప్తి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇటీవల కాలంలో సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధాలకు కరోనా సోకినట్లు తేలింది. తాజాగా మరో టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో తల్లితో కలిసి పర్యంటించారు శ్రీరామ్.
‘కరోనా పరీక్షల్లో స్వల్ప లక్షణాలతో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన మా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండి, ఏవైనా లక్షణాలతో టెస్టు వేయించుకొని జాగ్రత్తగా పడాల్సిందిగా తెలియజేస్తున్నాను..’ అని పరిటాల శ్రీరామ్ ట్వీట్ చేశారు.
— Paritala Sreeram (@IParitalaSriram) January 14, 2022
అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 808 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరుతున్నారు.
Also Read: ‘అమ్మా నేనెట్టా బ్రతికేది’.. తల్లికి అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలో తనయుడు ఆత్మహత్య
అక్క ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్