Viral: అక్క ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్

ప్రేమకు జాతి, కుల, మత, వయస్సు బేధాలు ఉండవని చెబుతుంటారు. తాజాగా లింగ బేధం కూడా ఉండదని కొందరు అంటున్నారు.

Viral: అక్క ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్
2 Girls Marriage
Follow us

|

Updated on: Jan 14, 2022 | 7:52 AM

ప్రేమకు జాతి, కుల, మత, వయస్సు బేధాలు ఉండవని చెబుతుంటారు. తాజాగా లింగ బేధం కూడా ఉండదని కొందరు అంటున్నారు. అనడం ఏంటి ఏకంగా ప్రేమించి.. పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనల గురించి వింటూనే ఉన్నాం.  తాజాగా ఇలాంటి ఉదంతమే.. రాజస్థాన్‌ చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో వెలుగుచూసింది. ఇద్దరు యువతుల మధ్య పరిచయం.. ఊహించని రీతిలో లవ్ టర్న్ తీసుకుంది. ఆ ప్రేమ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని జింద్‌ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రతన్‌గఢ్‌లోని తన సోదరి అత్తారింటికి ఏడాది క్రితం వచ్చింది. ఈ క్రమంలో తన సోదరి ఆడపడుచు(18)తో ఆమెకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అది కాస్తా బలపడి ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంట్లో వాళ్లు ఇద్దరూ కలుసుకోకుండా చేశారు.

గతేడాది నవంబరులో రతన్‌గఢ్‌కు చెందిన యువతి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. హర్యానాలోని అదంపుర్‌ మండీకి చేరుకుని తన ప్రేయసిని కలుసుకుంది. అనంతరం ఇరువురు ఫతేబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జింద్‌లో గత రెండు నెలలుగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. రతన్‌గఢ్‌ యువతి తండ్రి.. తన కుమార్తె కనిపించటం లేదని పోలీసులకు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని సెర్చింగ్ మొదలెట్టిన పోలీసులు.. జనవరి 12న  ఆ ఇద్దరు యువతులను గుర్తించారు. తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, తాము కలిసే జీవిస్తామని ఇరువురు యువతులు తెగేసి చెప్పేశారు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక వారిని పంపేశారు.

Also Read: మాదాపూర్‌లో రోడ్డుపై గుట్టలు గుట్టలుగా 2 వేల నోట్లు.. ఎగబడ్డ వాహనదారులు.. కట్ చేస్తే

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?