AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘అమ్మా నేనెట్టా బ్రతికేది’.. తల్లికి అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలో తనయుడు ఆత్మహత్య

అమ్మ ప్రేమ ఇంతే అని ఏ మనిషి కొలత వేసి చెప్పలేడు. అమ్మ ప్రేమ ఈ విశ్వమంత. అనంతం అని చెప్పినా కూడా అతిశయోక్తి కాదు.

Hyderabad: 'అమ్మా నేనెట్టా బ్రతికేది'.. తల్లికి అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలో తనయుడు ఆత్మహత్య
Tragedy
Ram Naramaneni
|

Updated on: Jan 14, 2022 | 8:37 AM

Share

అమ్మ ప్రేమ ఇంతే అని ఏ మనిషి కొలత వేసి చెప్పలేడు. అమ్మ ప్రేమ ఈ విశ్వమంత. అనంతం అని చెప్పినా కూడా అతిశయోక్తి కాదు. 9 నెలలు కడుపున మోస్తుంది.. అమ్మ. 90 ఏళ్లు వచ్చినా కూడా కడుపులో ఉన్నప్పటి ప్రేమనే కురిపిస్తుంది. తాజాగా తనను ప్రేమగా పెంచి.. పెద్ద చేసిన అమ్మ ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ తనయుడు.. జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. అమ్మ అంత్యక్రియలు చేసిన శ్శశానవాటికలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నీరు పెట్టించే ఈ ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక శ్యామ్‌నగర్‌లో నివాసముండే నాగేందర్‌, లక్ష్మీబాయి (60) దంపతులకు ఇద్దరు తనయులు. పిల్లల చిన్నతనంలోనే నాగేందర్‌ తనువు చాలించాడు. లక్ష్మీబాయి కూలీ పనులకు వెళ్లి కుమారులు వినోద్‌కుమార్‌(36), విజయ్‌కుమార్‌లను పెంచి పెద్దచేసింది. వినోద్‌కుమార్‌ కు ఇంకా పెళ్లి కాలేదు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న లక్ష్మిబాయి చనిపోగా… బుధవారం గోల్నాక హర్రాస్‌పెంట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మ లేదన్న బాధను తట్టుకోలేకపోయిన వినోద్‌ అంత్యక్రియల తర్వాత ఇంటికివచ్చి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. అమ్మను ఖననం చేసిన శ్మశాన వాటిక షెడ్డులో ఉరేసుకుని చనిపోయాడు.

Also Read: అక్క ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్