AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KP Ulli: కడప కె.పి ఉల్లికి జియో ట్యాగ్‌ ఇవ్వాలంటోన్న పరిశోధకులు.. విదేశాలకు ఎగుమతయ్యే ఈ ఉల్లి ప్రత్యేకతలేంటంటే.

KP Ulli: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని ఓ సామెత. ఉల్లి వేయని వంటకాన్ని మనం అస్సలు ఊహించలేం. ఇలా మన నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది ఉల్లి. అయితే ఇతర ఉల్లితో పోలీస్తే.. కడప జిల్లా మైదుకూరులోని కృష్ణాపురంలో పండించే కె.పి ఉల్లికి..

KP Ulli: కడప కె.పి ఉల్లికి జియో ట్యాగ్‌ ఇవ్వాలంటోన్న పరిశోధకులు.. విదేశాలకు ఎగుమతయ్యే ఈ ఉల్లి ప్రత్యేకతలేంటంటే.
Kp
Narender Vaitla
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 06, 2021 | 4:18 PM

Share

KP Ulli: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని ఓ సామెత. ఉల్లి వేయని వంటకాన్ని మనం అస్సలు ఊహించలేం. ఇలా మన నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది ఉల్లి. అయితే ఇతర ఉల్లితో పోలీస్తే.. కడప జిల్లా మైదుకూరులోని కృష్ణాపురంలో పండించే కె.పి ఉల్లికి ప్రత్యేకత ఉంది. ఈ ఉల్లిని ఏకంగా విదేశాలకు ఎగుమతి చేస్తారంటేనే దీని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి వినూత్నమైన ఉల్లికి ప్రత్యేక గుర్తింపు లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే కె.పి ఉల్లికి భౌగోళిక గుర్తింపు (జియో ట్యాగ్) ఇవ్వాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.

న్యాయ పరమైన రక్షణ లభిస్తుంది..

ఏ వస్తువుకైనా పేటెంట్‌ హక్కులు ఉంటాయి. ఆయా ప్రాంతాలకే పరిమితమైన వాటికి జియో ట్యాగ్‌ ఇస్తుంటారు. ఆ ఉత్పత్తులను సదరు ప్రాంతం పేరుతో పిలుస్తుంటారు. అలాగే కె.పి ఉల్లికి కూడా జియో ట్యాగ్ ఇవ్వాల్సిందేనని, ఈ ఉల్లి కడప జిల్లాకు మాత్రమే చెందిన ప్రత్యేక వంగడమని యోగి వేమన యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కృష్ణా పురం ఉల్లిని ఈ ప్రాంతానికి చెందిన ప్రత్యేక వంగడంగా గుర్తించి (జియో ట్యాగ్) భౌగోళిక పరమైన గుర్తింపు ఇస్తే న్యాయ పరమైన రక్షణ లభిస్తుందని,రైతులకు ఎగుమతుల విషయంలో ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ ఉల్లికి జియో ట్యాగ్ ఎందుకు ఇవ్వాలన్న విషయమై యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్రశాఖ పరిశోధకులు ఆచార్య పి.ఎస్ షావలీఖాన్ మాట్లాడుతూ.. ‘గతంలో పసుపు,మిర్చి చాలా వాటిలలో ఇతర దేశాలతో మనకు పేటెంట్ హక్కుల విషయంలో వివాదాలు కొనసాగాయి. అదే విధంగా ఈ కె.పి ఉల్లిని ఎక్కువగా ఇతర దేశాలు వాడుతున్నాయి.. ఈ ఉల్లిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇతర దేశాలు పేటెంట్ హక్కులు సాధిస్తే కడప జిల్లా కృష్ణాపురం ప్రాంత రైతులు చాలా నష్ట పోతారు, కాబట్టి కె.పి రకం ఉల్లిని భౌగోళిక గుర్తింపు ఇస్తే రైతులకు న్యాయం జరుగుతుంది’ అని వివరించారు.

Kp Ulli Special

ఈ ఉల్లికి పేరు ఎలా వచ్చింది, వీటి ప్రత్యేకత ఏంటి.?

పూర్వం కృష్ణాపురం రైల్వేస్టేషను నుంచి ఈ ఉల్లిని ఎగుమతి చేయడంతో కె.పి అనే పేరు వచ్చిందని ప్రచారం ఉంది. అలాగే మైదుకూరు పరిధిలోని కృష్ణాపురం రైతులు పండిస్తారు, కాబట్టి కృష్ణాపురం ఉల్లిని కె.పి ఉల్లిగా పిలుస్తున్నారని ఇక్కడి ప్రజల, రైతుల అభిప్రాయం. ఇక ఈ ఉల్లి ప్రత్యేకతల విషయానికొస్తే.. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్రశాఖ పరిశోధకులు ఆచార్య పి.ఎస్ షావలీఖాన్ నేతృత్వంలో పరిశోధన సాగించిన డాక్టరు జి .విజయలక్ష్మీ, ఇటలీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్సె , నేషనల్ రీసెర్చి కౌన్సెల్ పరిశోధకులు సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. యోగి వేమన యూనివర్సిటీ, ఇటలీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌, నేషనల్‌ రిసెర్చి కౌన్సెల్‌ సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టడంతో పరిశోధన పత్రాన్ని జర్నల్‌ ఆఫ్‌ బయాలాజికల్‌ సైన్స్ స్ప్రింగర్స్‌లో కూడా ప్రచురించారు.

కెపి ఉల్లి ప్రత్యేకించి ముదురు ఎరుపు రంగులో ఉండడానికి వాటిలో ఉండే ఆంథో సైనిన్ కారణమని పరిశోధకులు గుర్తించారు. ఇవి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించారు కూడా…అందుకే ఈ కేపి ఉల్లి వివిధ దేశాలకు అత్యధికంగా ఎగుమతి అవుతుంటాయి. ఇదిలా ఉంటే.. ఏ వంగడంలోనైనా కాలక్రమంలో తేజం, గడ్డల పరిమాణం తగ్గిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యోగి వేమన విశ్వ విద్యాలయం వృక్షశాస్త్ర శాఖ పరిశోధకులు ఉల్లి పుష్పాలను సేకరించి టిష్యూకల్చర్‌లో అతి శుద్ధమైన మొక్కలను ప్రయోగశాలలో సృష్టించారు.. ప్రయోగశాలలో తయారు చేసిన మొక్కలతో ఉల్లిపాయ పరిమాణం పెంచేందుకు ప్రయోగం చేస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

Kp Ulli

రిపోర్టర్: సేరి సురేష్ (Tv9 Telugu)

Also Read: Andhra Pradesh: అయ్యో పాపం.. ఊర కుక్కల దాడిలో మరణించిన అడవి దుప్పి..!

Heavy rains : కడప, కర్నూలు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లే వాగులుగా మారిన వైనం

Kadapa Crime News: అడ్డెడ్డె, బంగారం ఇంత చవకా..? ఆశపడి కొన్నారో కొంప కొల్లేరే