Ycp Leaders: ‘నేను రూ. 10 లక్షలు ఇచ్చా’.. వైసీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి..
Ycp Leaders: నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హరిచంద్రా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Ycp Leaders: నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హరిచంద్రా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే వరప్రసాద్ దండకాలు మొదలు పెట్టారంటూ తీవ్ర ఆరోపలు చేశారు. అంతేకాదు.. ఇప్పటికే తాను రూ. 10 లక్షలు ఎమ్మెల్యేకు ఇచ్చానని వెల్లడించారు. తనలాగే చాలా మంది వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్ భారీగా డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. గూడూరు పట్టణంలోని రోటరీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయాలని కానీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాత్రం అభివృద్ధి పేరుతో వసూళ్లు ప్రారంభించారని అన్నారు.
ఇప్పటికే పట్టణంలో బస్ షెల్టర్ పేరుతో తన వద్ద రూ. 10 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అలాగే టవర్ క్లాక్ ఆధునీకరణ పేరుతో పట్టణానికి చెందిన పలువురు వ్యాపారస్తులు, ప్రముఖుల వద్ద భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని హరిచంద్రా రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉంటూ ఇప్పటి వరకు దండిన డబ్బుకు సంబంధించిన లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే పై అదే పార్టీకి చెందిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.
Also read:
అచ్చమైన బెంగాలీ కుర్రాడిగా మారిపోయిన నేచురల్ స్టార్.. ఆకట్టుకుంటున్న ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్..