AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: అచ్చమైన బెంగాలీ కుర్రాడిగా మారిపోయిన నేచురల్ స్టార్.. ఆకట్టుకుంటున్న ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలో శివ నిర్వాణ  దర్శకత్వంలో నటిస్తున్న టక్ జగదీశ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు...

Shyam Singha Roy: అచ్చమైన బెంగాలీ కుర్రాడిగా మారిపోయిన నేచురల్ స్టార్.. ఆకట్టుకుంటున్న 'శ్యామ్ సింగరాయ్' ఫస్ట్ లుక్..
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 5:17 PM

Share

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలో శివ నిర్వాణ  దర్శకత్వంలో నటిస్తున్న టక్ జగదీశ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగాంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.  పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈ సినిమాలోసరికొత్త లుక్ లో కనిపించనున్నాడునాని. నేడు నాని పుట్టినరోజు కానుకగా నాని లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ . హెయిర్ స్టైల్ నుండి డ్రెస్సింగ్ వరకు చాలా డిఫరెంట్ గాకనిపిస్తున్నాడు నాని. ఒక అమ్మాయి నానిని వెనుక నుంచి ఆప్యాయంగా కౌగిలించుకొని ఉంది. మొత్తం మీద నాని ఇంతకముందు చేయని ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నాడని అర్థం అవుతోంది.

టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ తో అంచనాలను పెంచేసింది. దాదాపు ఈ సినిమా కోసం దర్శకుడు రాహుల్ రెండు సంవత్సరాలు వెయిట్ చేశాడట. పూర్తిగా కలకత్తా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. రాహుల్ రవీంద్రన్ – మురళీ శర్మ – అభినవ్ గోమటం ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varalaxmi Sarathkumar : ఆ హీరో సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..