చంద్రబాబును ఎర్రగడ్డలో చేర్చే టైమొచ్చింది.. పంచాయతీ ఫలితాలనుద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్‌

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా 23 సీట్లకే..

చంద్రబాబును ఎర్రగడ్డలో చేర్చే టైమొచ్చింది.. పంచాయతీ ఫలితాలనుద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్‌
Follow us

|

Updated on: Feb 24, 2021 | 5:27 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా 23 సీట్లకే పరిమితమైన తర్వాత చంద్రబాబు ఇలాగే గుడ్డలు చించుకుని మాట్లాడారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాతా అదే ఏడుపు రిపీట్ అయిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వైసీపీని గెలిపించి ప్రజలు తప్పు చేశారని అనడం చంద్రబాబుకు మతి పూర్తిగా భ్రమించిందని విజయసాయిరెడ్డి అన్నారు. పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరు చూస్తుంటే చంద్రబాబును ఎర్రగడ్డలో చేర్చాల్సిన పరిస్థితి కనిపిస్తోందని మండిపడ్డారు.

‘అందరి వివరాలు రాసుకున్నారంట. ఆధారాలు కూడా ఉన్నాయంట. జమిలి ఎన్నికల్లో వైసీపీని ఓడగొట్టి ఆయన సీఎం అయి తన పవరేంటో చూపిస్తారంట. 41 శాతం సర్పంచ్ పదవులు గెలిచామంటూ జబ్బలు చరుస్తున్నారు. హిందూపురం, అమరావతి, కుప్పంలోనే డిపాజిట్లు రాలేదు. మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నచోట సింగిల్ డిజిట్ దాటలేదు. మీ కాకిలెక్కల్ని జనం నమ్ముతారా? దమ్ముంటే గెలిచారంటున్న పంచాయతీలను ఎల్లో పేపర్లలోనైనా ప్రకటించండి అంటూ సవాల్‌ విసిరారు.

వైజాగ్ స్టీల్ పై ప్రధానికి రాసిన లేఖతో, తను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబు అంగీకరించారు. జగన్ గారి ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేసారు. కేంద్ర బడ్జెట్ లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించారు’ అని ట్వీట్ చేశారు.

Read more:

పట్టభద్రుల ఓట్లడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదు.. ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.