YS Jagan: నా కల.. నా లక్ష్యం.. మరో నినాదంతో జనంలోకి వైసీపీ అధినేత, సీఎం జగన్..
సిద్ధం సభలు ముగించి.. జనంలోకి మరింతగా దూసుకెళ్లాలని ప్లాన్ చేశారు సీఎం జగన్. తన లక్ష్యాలేంటి, తన కల ఏంటనేది చివరి సిద్ధం సభలో ప్రజలకు వివరించారు. పేదరికం సంకెళ్లు తెంచాలి, పిల్లలకు అంతర్జాతీయస్థాయి చదవులు చెప్పించాలి, ప్రతి అక్క, చెల్లెమ్మ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలన్నదే.. తన కల, లక్ష్యమన్నారు సీఎం జగన్. రైతులెవ్వరూ వ్యవసాయంతో నష్టపోయాం అనేది చూడొద్దని తాను కోరుకుంటున్నా అన్నారు జగన్.

సిద్ధం సభలు ముగించి.. జనంలోకి మరింతగా దూసుకెళ్లాలని ప్లాన్ చేశారు సీఎం జగన్. తన లక్ష్యాలేంటి, తన కల ఏంటనేది చివరి సిద్ధం సభలో ప్రజలకు వివరించారు. పేదరికం సంకెళ్లు తెంచాలి, పిల్లలకు అంతర్జాతీయస్థాయి చదవులు చెప్పించాలి, ప్రతి అక్క, చెల్లెమ్మ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలన్నదే.. తన కల, లక్ష్యమన్నారు సీఎం జగన్. రైతులెవ్వరూ వ్యవసాయంతో నష్టపోయాం అనేది చూడొద్దని తాను కోరుకుంటున్నా అన్నారు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పేదరికంతో ఎదగలేకపోయామన్న పరిస్థితి ఉండొద్దని, వారందరికీ సమాన అవకాశాలు రావాలన్నది తన కల, లక్ష్యమన్నారు. వైద్యం అందక ఎవ్వరూ మరణించొద్దు, లంచం అనేది వినిపించొద్దు, ఏ పేదవాడు వివక్షకు గురయ్యే పరిస్థితులు రావొద్దు అనేదే తన కల, లక్ష్యమన్నారు సీఎం జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారితలో మార్పులు తెచ్చి.. సామాజిక న్యాయానికి అర్థం చెప్పామన్నారు జగన్. తనకు అధికారం అంటే వ్యామోహం లేదని.. చరిత్రలో తన పేరు నిలిచిపోవాలన్నదే తన లక్ష్యమన్నారు సీఎం. ఇక సిద్ధం సభలు ముగియడంతో.. జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం జగన్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే.. సిద్ధం సభలకు మించి ప్రచారంలో జోరు పెంచాలని ప్రణాళికలు రెడీ చేశారు. రోజూ 2, 3 జిల్లాల్లో సభలు జరిపేలా.. రోడ్ షోలు నిర్వహించేలా మెగా క్యాంపెయిన్‌కు రెడీ అయ్యారు సీఎం జగన్..
నేడు పులివెందులలో సీఎం జగన్ పర్యటన
సీఎం జగన్ నేడు పులివెందుల వెళ్లనున్నారు.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో జగన్ పాల్గొంటారు..డాక్టర్ వైయస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తారు. తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైయస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైయస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారైంది..అనంతరం డాక్టర్ వైయస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ దగ్గరకు వెళ్తారు..మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ YSR మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆపై YSR ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..