AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్.. పూర్తి వివరాలు ఇవే

దేశంలోని రైల్వే ప్రయాణికుల సంక్షేమం, త్వరితగతిన ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సాధారణ రైళ్లకు భిన్నంగా సకలు సౌకర్యాలు ఉండటంతో వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది.

Vande Bharat: సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్.. పూర్తి వివరాలు ఇవే
Vande Bharat Express
Balu Jajala
|

Updated on: Mar 11, 2024 | 7:13 AM

Share

దేశంలోని రైల్వే ప్రయాణికుల సంక్షేమం, త్వరితగతిన ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సాధారణ రైళ్లకు భిన్నంగా సకలు సౌకర్యాలు ఉండటంతో వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను 12న సికింద్రాబాద్ నుండి జెండా ఊపి ప్రారంభం చేయనున్నారు (వర్చువల్ గా).

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 6 రోజులు (గురువారం మినహా)నడిచే ఈ రైలు  రెండు తెలుగు రాష్ట్రాల  మధ్య  వేగవంతమైన అనుసంధానాన్ని కలుగజేస్తుంది. భారతీయ రైల్వేల సేవల్లో బాగా పేరొందిన ఈ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్  సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే  రెండవ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్. తెలంగాణ నుండి నాల్గవ వందే భారత్ ఎక్స్‌ రేపట్నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైలు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100% కంటే ఎక్కువ సామర్థ్యంతో నడుస్తోంది. ఇప్పుడు అదనంగా ప్రయాణీకుల ప్రయోజనం కోసం, మరో  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అదే మార్గంలో, అదే స్టాపేజ్‌లతో  పరుగులు పెట్టబోతోంది. ఈ రైలు సాధారణ సేవలు విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు 13 మార్చి నుండి సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు మార్చి 15 ప్రారంభమవుతాయి.  వీటికి  టిక్కెట్ల  బుకింగ్స్ 12 మార్చి, 2023 నుండి అందుబాటులోఉంటాయి.

రైళ్ల వివరాలు ఇవే..

రైలు నంబర్ 20707 సికింద్రాబాద్–విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ ప్రెస్,  సికింద్రాబాద్ నుండి ఉదయం 05.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో  రైలు నంబర్ 20708 విశాఖపట్నం – సికింద్రాబాద్ రైలు  మధ్యాహ్నం 14.35 గంటలకు విశాఖపట్నం నుండి  బయలుదేరి రాత్రి 23.20గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మరియు సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఏ.సి చైర్ కార్ కోచ్‌లు  కలిగి 530 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో సేవలను అందిస్తుంది.