AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఢిల్లీ నుంచి ఏపీకి మారిన పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై ఇవాళ క్లారిటీ

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలోని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుత 2024 ఎన్నికల్లో పొత్తుల కీలక కావడంతో తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిల్లీ వేదికగా కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల వ్యవహరం ఇక ఏపీకి మారింది. దీంతో విజయవాడలో ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ తొలి ఉమ్మడి సమావేశం కానుంది.

AP Politics: ఢిల్లీ నుంచి ఏపీకి మారిన పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై ఇవాళ క్లారిటీ
Ap Politics
Balu Jajala
|

Updated on: Mar 11, 2024 | 10:13 AM

Share

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలోని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుత 2024 ఎన్నికల్లో పొత్తుల కీలక కావడంతో తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిల్లీ వేదికగా కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల వ్యవహరం ఇక ఏపీకి మారింది. దీంతో విజయవాడలో ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ తొలి ఉమ్మడి సమావేశం కానుంది. నిన్న పురంధేశ్వరి, పవన్‌తో బీజేపీ కేంద్ర బృందం భేటీ అయ్యింది. గజేంద్రసింగ్‌ షెఖావత్‌, జయంత్‌ పాండా, శివప్రకాష్‌ చర్చలు జరిపారు. అయితే నేడు మూడుపార్టీల మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొననుండటంతో సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు.

ఏపీకి సంబంధించి పొత్తు ఫిక్స్‌ అయిన నేపథ్యంలో సీట్లు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, జనసేన, బీజేపీ తదుపరి చర్చలు అమరావతి వేదికగానే జరగనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీతో ఒప్పందం ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ఇప్పటికే ఒక క్లారిటీ రాగా.. అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించింది. అయితే.. అసెంబ్లీ స్థానాల కంటే ఎంపీ స్థానాలపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి, సంఘటన్‌ కార్యదర్శి మధుకర్‌ సారథ్యంలో బీజేపీ నేతలు ప్రత్యేక కసరత్తు చేయబోతున్నారు.

బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు ఖాయం

 అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి

నర్సాపురం- రఘురామకృష్ణరాజు లేదా నరేంద్రవర్మ

తిరుపతి- రత్నప్రభ లేదా నీహారిక

హిందూపురం- సత్యకుమార్, రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డి

అనకాపల్లి, ఏలూరుపై క్లారిటీ లేకపోవడంతో చర్చలు

పొత్తులో బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు

విశాఖ నార్త్, పి.గన్నవరం, కైకలూరు, ధర్మవరం

జమ్మలమడుగు, మదనపల్లె, గుంటూరు

మదనపల్లె, గుంటూరులో ఏదో ఒకటి మాత్రమే!

నంద్యాల అసెంబ్లీ టిక్కెట్‌పై అభిరుచి మధు కన్ను

అభ్యర్థుల ఎంపికపై ఫైనల్‌ స్క్రీనింగ్‌

 వాస్తవానికి.. పొత్తులో భాగంగా.. బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు ఖాయం అయినట్లు తెలుస్తోంది. దాంతో.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆరు ఏంపీ స్థానాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం.. అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి, నర్సాపురం- రఘురామకృష్ణరాజుతో పాటు నరేంద్రవర్మ పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ. అలాగే.. తిరుపతి- రత్నప్రభ లేదా నీహారిక, హిందూపురం- సత్యకుమార్, రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డిని బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. అనకాపల్లి, ఏలూరుపై క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు.. పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు ప్రచారం నడుస్తోంది. వాటిలో.. విశాఖ నార్త్, పి.గన్నవరం, కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లె, గుంటూరు ఉన్నాయి. అయితే.. మదనపల్లె, గుంటూరు సీట్లుకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రాకపోవడంతో చర్చలు సాగుతున్నాయి. ఈ రెండింట్లో ఏదో ఒక స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. దాంతోపాటు.. నంద్యాల అసెంబ్లీ టిక్కెట్‌ బీజేపీ నేత అభిరుచి మధు అడుగుతుండగా.. ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలోనే.. ఆ స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై ఫైనల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు.

ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో పొత్తు ఫిక్స్‌ అయిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. బీజేపీకి ఎన్ని సీట్లు, ఏఏ స్థానాలు, ఎక్కడెక్కడ పోటీ అనేది ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. మొత్తంగా.. పొత్తులు నేపథ్యంలో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది ఏపీ బీజేపీ. ఒకట్రెండు రోజుల్లోనే లిస్ట్‌ ఫైనల్ చేయననున్నారు బీజేపీ నేతలు.