Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్ వైపు మరో బీఆర్ఎస్ నేత చూపు.. ఆ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ రంగు..

అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆ పార్టీకి నల్లగొండ జిల్లాలో ఊహించని షాక్‎లు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కమలం గూటికి చేరగా, మరో నేత హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌ పాలిటిక్స్‌ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామాలతో జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Telangana: కాంగ్రెస్ వైపు మరో బీఆర్ఎస్ నేత చూపు.. ఆ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ రంగు..
Congress vs BRS
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 11, 2024 | 10:46 AM

అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆ పార్టీకి నల్లగొండ జిల్లాలో ఊహించని షాక్‎లు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కమలం గూటికి చేరగా, మరో నేత హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌ పాలిటిక్స్‌ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామాలతో జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత జిల్లాకు చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో మరికొందరు గులాబీ నేతలు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్‎లో చేరుతారని ప్రచారంలో జోరుగా సాగుతోంది.

దీపం ఉండగానే ఇంటినిచక్కబెట్టుకోవాలని భావించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ, మునుగోడుల నుండి తనయుడి పొలిటికల్ ఎంట్రీకి గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో తనయుడు పొలిటికల్ ఎంట్రీకి గుత్తా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు గుత్తా సుఖేందర్‌రెడ్డి.. అటు అమిత్‌ కూడా.. నల్లగొండ ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధమంటూ ప్రకటించారు. సుఖేందర్ రెడ్డితో ఉన్న పాత వైరానికి కొందరు బీఆర్ఎస్ నేతలు కొత్త పదును పెట్టడంతో నల్లగొండ, భువనగిరిలో ఎక్కడ టికెట్‌ ఇచ్చినా పోటీకి సిద్ధమేనని గుత్తా చెప్పారు. అయితే అమిత్ రెడ్డి అభ్యర్థిత్వతాన్ని కొందరు నేతలు వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం కంటే.. కామ్‌గా ఉండటమే గౌరవప్రదమని గుత్తా భావించారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేదిలేదని కేటీఆర్‎కు స్పష్టం చేశారట. ఎలాగైనా తనయుడిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలన్న సుఖేందర్ రెడ్డి ఆశలపై.. సొంత పార్టీ నేతలే నీళ్లు చల్లడాన్ని గుత్తా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడితో కలిసి కాంగ్రెస్‎లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఇందులో భాగంగానే గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ కుమార్ రెడ్డి హస్తం పార్టీవైపు చూస్తున్నారట.

మంత్రి కోమటిరెడ్డితో అమిత్ భేటీ..

బీఆర్ఎస్‎ను వీడి కాంగ్రెస్‎లో చేరాలని భావిస్తున్న గుత్తా.. తాజాగా హైదరాబాద్‎లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గుత్తా అమిత్ రెడ్డి కలుసుకోవడం హాట్ టాపిక్‎గా మారింది. బీఆర్ఎస్‎ను వీడి కాంగ్రెస్‎లో చేరే అంశాన్ని మంత్రితో అమిత్ చర్చించినట్లు సమాచారం. భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కోమటిరెడ్డిని కోరారట.

ఇవి కూడా చదవండి

భువనగిరి టికెట్ దక్కేనా..

కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న అమిత్‎కు నల్లగొండ ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పటికే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమిత్‎కు భువనగిరి టికెట్ అంతా ఈజీ కాదట. భువనగిరి టికెట్‎ను సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ చాల మంది నేతలు ఆశిస్తున్నారు. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఉన్న వారికే టికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద గుత్తా కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..