Farmers: అడుగంటుతున్న భూగర్భజలాలు.. ఎండిపోతున్న పంట పొలాలు, ఆందోళనలో అన్నదాతలు
భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో చేతికి వచ్చిన పంటలన్నీ ఎండిపోతున్నాయి.. ఆయకట్టు చివరి భూములకు నీరు రావడం లేదు.. పచ్చని పొలాలు ఎండిపోవడంతో రైతులు తట్టుకోవడం లేదు. వాగు సమీపం లో ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పి నుంచీ నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని కోరుతున్నారు అన్నదాతలు. కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి.

భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో చేతికి వచ్చిన పంటలన్నీ ఎండిపోతున్నాయి.. ఆయకట్టు చివరి భూములకు నీరు రావడం లేదు.. పచ్చని పొలాలు ఎండిపోవడంతో రైతులు తట్టుకోవడం లేదు. వాగు సమీపం లో ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పి నుంచీ నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని కోరుతున్నారు అన్నదాతలు. కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా ఆయకట్టు ప్రాంతంలో కూడా సరిగా నీరు రావడం లేదు. ఆయ కట్టు చివరి భూములకు నీరు అందడం లేదు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వరి పొట్ట దశలో ఉంది. మరో 15 రోజులు గడుస్తే.. పంట దక్కే అవకాశం ఉంది.. కానీ.. ఎస్ఆర్ఎస్పి నుంచీ నీరు రావడం లేదు. దీని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి.
మొగ్దుంపూర్లో.. పెద్ద ఎత్తున పంటలు ఎండిపోతున్నాయి. పక్కనే వాగు ఉంది. వాగులో నీటి చుక్క లేదు.. గతంతో ఎస్ఆర్ఎస్ నుంచీ వాగుకు నీటిని వదిలి పెట్టేవారు. కానీ.. నీటిని డుదల చేయడం లేదు. అదే ధంగా చివరి ప్రయత్నంలో బావుల పూడిక తీస్తున్నారు. కానీ నీరు రావడం లేదు. బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ వంద ఎకరాకుల పైగా వరి ఎండిపోయింది… పొలాలను.. కాపాడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నీరు రాకపోతే.. పెద్ద ఎత్తున పొలాలు ఎండిపోయే అవకాశం ఉంది. కేవలం ఇక్కడే కాదు.. చాలా ప్రాంతాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి.. ప్రధాన ప్రాజెక్ట్లో కూడా గణనీయంగా నీటి శాతం తగ్గుతుంది. దీని కారణంగా దిగువకు నీటిని విడుదల చేయలేకపోతున్నారు.
పొలాలు ఎండిపోవడంతో.. రైతులు తట్టుకొని పరిస్థితి.. కెనాల్ నీటిని వి డుదల చేయాలని కోరుతున్నారు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతంలో కూడా సరిగా నీరు రావడం లేదు. వరితో పాటు ఇతర ఆరు తడి పంటలు కూడా ఎండిపోతున్నాయి… ప్రభుత్వం వెంటనే స్పందించి… నీటిని వి డుదల చేయాలని కోరుతున్నారు అన్నదాతలు. పంటలన్నీ ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్ట దశలో ఎండిపోవడంతో.. తీవ్రంగా నష్టపోతున్నామని తెలుపుతున్నారు. వెంటనే.. నీటిని డుదల చేసి పంటలను కాపాడాలని కోరుతున్నారు. మొత్తం పంటలన్నీ ఎండిపోతున్నా రైతులు అంటున్నారు. మరో 15 రోజులైతే.. పంట చేతికి వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు.