EWS Reservation: ఈడబ్ల్యూఎస్ చేయూత పథకం భేష్!.. మరి దాని సంగతేంటి?.. సీఎం జగన్‌కు కాంగ్రెస్ నేత సూటి ప్రశ్న..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈడబ్ల్యూఎస్ చేయూత పథకాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ప్రకటించారు.

EWS Reservation: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈడబ్ల్యూఎస్ చేయూత పథకాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ప్రకటించారు. ఈ పథాన్ని భేష్ అన్న ఆయన.. సీఎం జగన్‌కు పలు సూటి ప్రశ్నలు వేశారు. బుధవారం నాడు కడప జిల్లాలోని వేంపల్లిలో మీడియాతో మాట్లాడారు తులసీ రెడ్డి. ఈ సందర్భంగా ఈడబ్ల్యూఎస్ పథకం సరేనన్న ఆయన.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సంగతేమైంది? అని ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు.
అగ్రవర్ణ పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ఉద్యోగాల్లో పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేయడం లేదని విమర్శించారు. అగ్రవర్ణ పేదలపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. ఈడబ్ల్యూఎస్ చేయూతతో పాటు, 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తులసీ రెడ్డి డిమాండ్ చేశారు.
Also read:
ఆసుపత్రిలో కోలుకుంటున్న టైగర్ వుడ్స్, గెట్ వెల్ సూన్ అంటున్న ట్రంప్, ఒబామా, టైసన్
హైదరాబాద్‌లో మరో క్రికెట్ అకాడమీ.. ప్రారంభించిన సిక్సర్ల వీరుడు..