ఆసుపత్రిలో కోలుకుంటున్న టైగర్ వుడ్స్, గెట్ వెల్ సూన్ అంటున్న ట్రంప్, ఒబామా, టైసన్

కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ క్రమంగా కోలుకుంటున్నాడని ఆసుపత్రివర్గాలు తెలిపాయి...

ఆసుపత్రిలో కోలుకుంటున్న టైగర్ వుడ్స్, గెట్ వెల్ సూన్ అంటున్న ట్రంప్, ఒబామా, టైసన్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 24, 2021 | 5:00 PM

కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ క్రమంగా కోలుకుంటున్నాడని ఆసుపత్రివర్గాలు తెలిపాయి. యాక్సిడెంట్ లో ఆయన కుడికాలికి, మడమకు తీవ్ర గాయాలయ్యాయి.  డాక్టర్లు చాలాసేపు  జయప్రదంగా ఆపరేషన్ చేసినట్టు వుడ్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అతడు స్పృహలో ఉన్నాడని, కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడని  ఈ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, మహాబలుడు మైక్ టైసన్ తదితరులు వుడ్స్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. వుడ్స్ ని ట్రంప్ ‘ట్రూ ఛాంపియన్’గా అభివర్ణించారు. మొత్తం దేశమంతా నీకోసం ప్రార్థిస్తోందన్నారు. 2019 లో వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో వుడ్స్ కు ఆయన ‘మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ అవార్డు నిచ్చి  సత్కరించారు. 15 సార్లు మేజర్ చాంపియన్ అయిన టైగర్ వుడ్స్ సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలంటూ ఇంకా అనేకమంది ఆకాంక్షించారు. వుడ్స్ ను ఆయన సన్నిహితులు ఆప్యాయంగా ‘టైగర్ స్లామ్ ‘ అని పిలుచుకుంటారు.

కాగా ఈ ప్రమాదంలో టైగర్ వుడ్స్ ప్రయాణించిన వాహనం పూర్తిగా తుక్కుతుక్కు అయింది. ఇందుకు కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి వుడ్స్ అనేకసార్లు గోల్ఫ్ లో ఛాంపియన్ గా నిలిచాడు. అమెరికాలో ఇతనికి లక్షలాది అభిమానులు ఉన్నారు.

Also Read:

Varalaxmi Sarathkumar : ఆ హీరో సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్..

NSE, BSE trading Extended: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ టైమ్ పొడిగించారు..